Kerala: విధి చాలా విచిత్రమైనది. ఎన్నో నాటకీయ పరిణామాలకు అది వేదిక అవుతుంది. అలాంటి సంఘటనే ఇది. ఈ సంఘటనలో ఆ వ్యక్తికి విచిత్రమైన అనుభవం ఎదురయింది. అతడు సమాజాన్ని జాగృత పరచాలని చేసిన ప్రయత్నం మంచిదే అయినప్పటికీ.. చివరికి అది అతడికే ఎదురు తన్నింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో విస్తృతంగా దర్శనమిస్తోంది.
ఇటీవల కాలంలో దేశవ్యాప్తంగా కుక్క కాట్ల కేసులు పెరిగిపోతున్నాయి. ఇంజక్షన్లు వేయించుకోవడంలో ప్రజలు చూపిస్తున్న శ్రద్ధ ఘోరాలకు దారితీస్తోంది. ఇంజక్షన్లు వేయించుకోవడం వల్ల రేబిస్ కేసులు వెలుగు చూస్తున్నాయి. రేబిస్ అనేది అత్యంత ప్రమాదకరమైన వ్యాధి. అది చూస్తుండగానే మనిషి ప్రాణాలను తీసేస్తుంది. మనిషి ప్రాణాలు పోయే క్రమంలో తీవ్రంగా ఇబ్బంది పడతాడు. కుక్క మాదిరిగా అరుస్తాడు. హైడ్రోఫోబియాతో బాధపడతాడు. నీళ్లను చూస్తే వణికి పోతాడు. అంతేకాదు తోటి మనుషులపై దాడి చేయడానికి కూడా ఏమాత్రం వెనుకాడడు. అతడి లాలాజలంలో రేబిస్ వైరస్ ఉంటుంది కాబట్టి.. ఆ వ్యక్తులు దాడి చేస్తే రేబిస్ సోకుతుంది.
ఇటీవల కాలంలో వీధి కుక్కల దాడుల కేసులు పెరిగిపోయిన నేపథ్యంలో.. రేబీస్ మరణాలు కూడా అక్కడక్కడ చోటు చేసుకుంటున్నాయి. అందువల్లే ప్రభుత్వాలు ఆస్పత్రులలో రేబిస్ వ్యాక్సిన్ లను అందుబాటులో ఉంచుతున్నాయి. కుక్కలతో ఆడుకునేటప్పుడు.. ప్రమాదవశాత్తు కుక్కలు దాడి చేసినప్పుడు.. కచ్చితంగా ఇంజక్షన్లు వేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. అయితే రేబిస్ మరణాలపై అవగాహన కల్పించడానికి.. కుక్కలు దాడులు చేసినప్పుడు ఇంజక్షన్లు వేయించుకోవడం ఎంత ముఖ్యమో చెప్పడానికి ఓ వ్యక్తి వీధి నాటకం వేశాడు. స్టేజి మీద ప్రదర్శన కూడా ఇచ్చాడు. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ.. ఆ తర్వాతే అసలు సంఘటన జరిగింది.
కేరళ రాష్ట్రంలోని కన్నూరు ప్రాంతంలో వీలుకుక్కల దాడులపై అవగాహన కల్పించడానికి రాధాకృష్ణన్ అనే కళాకారుడుని స్టేజిపై కుక్క కరిచింది. రాధాకృష్ణన్ పిల్లాడిపై కుక్క దాడి చేసే సన్నివేశాన్ని ప్రదర్శించాడు. కుక్కలు మొరుగుతున్నట్టుగా.. పిల్లాడు కేకలు వేస్తున్నట్టుగా శబ్దాలను వెనుక నుంచి ప్లే చేశారు. కానీ ఇంతలోనే ఒక కుక్క వచ్చింది.. ఆయన కాలుపై కరిచింది. ఇంత జరిగినప్పటికీ కూడా ఆయన ఆ నాటకాన్ని పూర్తి చేసిన తర్వాతే ఆసుపత్రి వెళ్లారు. వాస్తవానికి కుక్క ఆయనను కరవడాన్ని నాటకంలో భాగమేనని చూస్తున్న ప్రజలు భావించడం విశేషం.
రాధాకృష్ణన్ ను కుక్క కరిచిన దృశ్యాలకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో విస్తృతంగా కనిపిస్తోంది. మంచి చేయబోతే చెడు ఎదురు అవ్వడం అంటే ఇదే కాబోలు అని నెటిజన్లు పేర్కొంటున్నారు. వాస్తవానికి కుక్కలు కరిస్తే జాగ్రత్తగా ఉండాలని.. ఏ మాత్రం నిర్లక్ష్యం ప్రదర్శించకుండా ఇంజక్షన్లు వేయించుకోవాలని చెబుతున్న ఇతడిని కుక్క కరవడం నిజంగా విధి వైపరీత్యమని నెటిజన్లు పేర్కొంటున్నారు.
கேரள மாநிலம் கண்ணூரில், தெருநாய் தாக்குதல் குறித்த விழிப்புணர்வு நாடகம் நடத்திக்கொண்டிருந்த ராதாகிருஷ்ணன் என்பவரை, மேடையில் எதிர்பாராதவிதமாக ஒரு தெருநாய் கடித்தது. வலிக்கு மத்தியிலும் நாடகத்தை முழுமையாக முடித்த அவர், பின்னர் சிகிச்சைக்காக மருத்துவமனை சென்றார். விழிப்புணர்வு… pic.twitter.com/AeWZjMt1vP
— PttvOnlinenews (@PttvNewsX) October 6, 2025