Homeక్రీడలుక్రికెట్‌FIFA World Cup 2026: వాటర్ బాటిల్ 500.. చికెన్ ఫ్రై 1800.. ఈ రేట్ల...

FIFA World Cup 2026: వాటర్ బాటిల్ 500.. చికెన్ ఫ్రై 1800.. ఈ రేట్ల వెనుక ఉన్న ఇంట్రెస్టింగ్ స్టోరీ ఇదీ

FIFA World Cup 2026: మనం ఒక వాటర్ బాటిల్ కొనుగోలు చేస్తే ఎంత ఖర్చు పెడతాం.. మహా అయితే 20.. ఇంకాస్త ప్రీమియం అనుకుంటే 30.. ఇంకా బాగా ప్రీమియం అనుకుంటే 50.. కాదు కూడదు మరింత రీచ్ అనుకుంటే 100.. కానీ అక్కడ వాటర్ బాటిల్ 500.. మనం బయట చికెన్ ఫ్రై తింటే ఎంత పెడతాం మహా అయితే 250, లేకపోతే 300.. ఇంకా గట్టిగా అయితే 500.. అంతకుమించదు.. కానీ అక్కడ […]

FIFA World Cup 2026: మనం ఒక వాటర్ బాటిల్ కొనుగోలు చేస్తే ఎంత ఖర్చు పెడతాం.. మహా అయితే 20.. ఇంకాస్త ప్రీమియం అనుకుంటే 30.. ఇంకా బాగా ప్రీమియం అనుకుంటే 50.. కాదు కూడదు మరింత రీచ్ అనుకుంటే 100.. కానీ అక్కడ వాటర్ బాటిల్ 500.. మనం బయట చికెన్ ఫ్రై తింటే ఎంత పెడతాం మహా అయితే 250, లేకపోతే 300.. ఇంకా గట్టిగా అయితే 500.. అంతకుమించదు.. కానీ అక్కడ చికెన్ ఫ్రై ప్లేట్ వచ్చేసి 1800.. ఇంతేనా ఇంకా చాలా ఉంది అక్కడి రేట్ల కథ.. ఇంతకీ ఆ వ్యవహారం ఏంటంటే..

2026 సీజన్లో ఫుట్బాల్ టోర్నీ పూర్తయింది. స్పెయిన్ జట్టు విజేతగా నిలిచింది. ఫైనల్ మ్యాచ్లో అర్జెంటీనా మీద ఒక్క గోల్ తేడాతో గెలుపును దక్కించుకుంది. తద్వారా సరిహిత చరిత్రను తన పేరు మీద రాసుకుంది. దాదాపు 16 సంవత్సరాల తర్వాత విజేతగా నిలిచి అందరిని ఆశ్చర్యపరిచింది. స్పెయిన్ జట్టు విజయం చాలా మంది ప్లేయర్లకు ఆనందాన్ని కలిగించింది. ఎందుకంటే ఫుట్బాల్ అంటే కేవలం వేగం, దూకుడు మాత్రమే కాదని.. ఆలోచన అని.. స్థిరమైన విధానమని నిరూపించింది.

ఈసారి జరిగిన ఫుట్బాల్ టోర్నీ.. ఫుట్బాల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైనదిగా మిగిలిపోయింది. ఈసారి ఫుట్బాల్ టోర్నీలో మొత్తంగా ప్రైజ్ మనీ 6300 కోట్లుగా ప్రకటించారు. ఇందులో విజేత అయిన స్పెయిన్ జట్టుకు ఏకంగా 481 కోట్లు వచ్చాయి. రెండవ స్థానంలో ఉన్న అర్జెంటినాకు 317 కోట్లు దక్కాయి. మూడో స్థానంలో ఉన్న ఇంగ్లాండ్ జట్టుకు 279.. నాలుగు స్థానంలో ఉన్న ఫ్రాన్స్ జట్టుకు 259 కోట్లు సొంతమయ్యాయి.

ప్రైజ్ మనీ విషయంలోనే కాకుండా.. ప్రేక్షకుల నుంచి టికెట్లు.. ఇతర వ్యవహారాల ద్వారా భారీగా వసూలు చేసిన టోర్నీగా కూడా ఈసారి జరిగిన వరల్డ్ కప్ చరిత్రలో నిలిచిపోయింది. ఫుట్బాల్ మ్యాచ్ జరిగే మైదానంలో వెహికల్ పార్కింగ్ చేస్తే.. ఒక వాహనానికి 7,200 చొప్పున వసూలు చేశారు. వాటర్ బాటిల్ ఒక్కదానికి 500 ఛార్జ్ చేశారు. మ్యాచ్ వీక్షించేందుకు కొనుగోలు చేసే టికెట్ యావరేజ్ ధరను 45000 గా నిర్ణయించారు. అఫీషియల్ హాస్పిటాలిటీ సీటు ఒక్క టికెట్ ధరను 62,000 కు విక్రయించారు. చికెన్ ఫ్రైస్ ను 1800 కు విక్రయించారు. ఇక వరల్డ్ కప్ లో ప్రైవేట్ కప్ సూట్ కు దాదాపు రెండు కోట్ల వరకు వసూలు చేశారు. ఇందులో 40 మంది వరకు గెస్టులు కూర్చోవచ్చు. వీరందరికీ ప్రీమియం సదుపాయాలు కల్పించారు. ఇక ఒక బీర్ ను 1800 లకు విక్రయించారు. ప్రైజ్ మనీ.. టికెట్లు.. తినుబండారాలు. పార్కింగ్ ఫీజు.. ప్రసార హక్కులు.. తాగే బీరు.. ప్రతి దాంట్లో కూడా ప్రీమియం రేంజ్ ధర వసూలు చేయడంతో ఈసారి ఫిఫాకు కాసుల పంట పండింది.

 

View this post on Instagram

 

A post shared by Rupees (@rupees)

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper