
ఎంఎస్ ధోనీ కోసం తుపాకీ గుండుకు ఎదురెళ్తానని టీమ్ ఇండియా స్ట్రోక్ ప్లేయర్ కేఎల్ రాహుల్ అంటున్నాడు. అందుకోసం రెండో ఆలోచనే చేయనని చెబుతున్నాడు. జట్టు సభ్యులు అతడికెంతో గౌరవం ఇస్తారని వెల్లడించాడు. ఆటగాళ్లు సామర్థ్యం మెరుగుపర్చడంలో విరాట్ కోహ్లీకి తిరుగులేదని తెలిపాడు. ప్రస్తుతం ఇంగ్లాండ్ లో పర్యటిస్తున్న రాహుల్ మీడియాతో మాట్లాడాడు. నా దృష్టిలో మాత్రం ఒక నాయకుడిగా జట్టు సభ్యుల గౌరవం దక్కించుకోవడమే అతిపెద్ద ఘనత అని రాహుల్ అన్నాడు.