
ఎన్నో రోగాలను నయం చేయగల దివ్యౌషధం, మహా మూలికలలో శొంఠి ఒకటని చెప్పవచ్చు. శొంఠి ఎన్నో అపూర్వమైన గుణాలను కలిగి ఉంది. మహర్షులు శొంఠికి విశ్వభేజనం అని నామకరణం చేశారంటే శొంఠి యొక్క గొప్పదనం ఏమిటో సులభంగానే అర్థమవుతుంది. అల్లంపై ఉండే పొట్టును తీసి సున్నపుతేటలో ముంచి నానబెడితే శొంటి వస్తుంది. వర్షాకాల వ్యాధులకు సులభంగా చెక్ పెట్టడంలో శొంఠి ఎంతగానో సహాయపడుతుంది.
వర్షాకాలంలో చాలామందిని జలుబు, దగ్గు సమస్యలు వేధిస్తూ ఉంటాయి. శొంఠి పొడిని నీళ్లలో కలిపి మరగబెట్టి తాగితే ఉపశమనం కలుగుతుంది. మానవునిలో రోగనిరోధకశక్తిని వృద్ధి చేయడంలో కడుపు ఉబ్బరాన్ని, గ్యాస్ ను తగ్గించడంలో శొంఠి తోడ్పడుతుంది. శొంఠి పురుషులలో వీర్యకణాలను వృద్ధి చేయడంతో పాటు కిడ్నీ సమస్యలకు చెక్ పెట్టడంలో ఎంతగానో తోడ్పడుతుంది. దగ్గు, హృదయ రోగాలను, బోదకాలను, వాత రోగాలను, ఉదర శూలాలను, శ్వాస రోగాలను తగ్గించడంలో తోడ్పడుతుంది.
మేకపాలతో కలిసి శొంఠి పొడిని సేవిస్తే విష జ్వరాలకు చెక్ పెట్టే అవకాశం అయితే ఉంటుంది. పావు చెంచా శొంఠిపొడిని ఒక చెంచా తేనెతో కలిపి సేవిస్తూ ఉంటే ఉదరంలో గ్యాస్ తగ్గి ఉపశమనం లభించే అవకాశం ఉంటుంది. శొంఠిని నీటితో కలిపి మెత్తగా నూరి నుదుటిపై రాస్తే తలనొప్పి సమస్య దూరమవుతుంది. పొట్ట మందగించి ఆకలి కాకుండా ఉన్నవాళ్లు 5 గ్రాముల శొంఠిని తీసుకుంటే ఆ సమస్య దూరమవుతుంది.
రక్త క్షీణత వల్ల వచ్చే రోగాలకు సైతం చెక్ పెట్టడంలో శొంఠి ఉపయోగపడుతుంది. రోజుకు మూడు పూటలా శొంఠి పొడి, సైంధవ లవణం పొడి కలిపి తాగితే పక్షవాతంకు చెక్ పెట్టడం సాధ్యమవుతుంది. చిటికెడు శొంఠిని ఒక చెంచా వంటాముదంతో కలిపి తాగితే నడుం నొప్పితో పాటు ఇతర అనారోగ్య సమస్యలకు సులభంగా చెక్ పెట్టవచ్చు. వేడి అన్నంలో శొంఠి పొడిని, పప్పునూనెను కలిపి రోజూ తీసుకుంటే అజీర్తి సమస్యకు చెక్ పెట్టవచ్చు.