
మనలో చాలామంది వృత్తిరిత్యా, ఉద్యోగరిత్యా ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి మారుతూ ఉంటారు. ఒక అడ్రస్ నుంచి మరొక అడ్రస్ కు మారిన సమయంలో ఓటర్ కార్డ్ లోని అడ్రస్ ను కూడా మార్చుకుంటే మంచిది. ఓటర్ కార్డులోని అడ్రస్ ను సులభంగానే మార్చుకోవచ్చు. ఓటర్ కార్డ్ ను సాధారణంగా అడ్రస్ ప్రూఫ్ గా, ఐడీ ప్రూఫ్ గా వినియోగిస్తామనే సంగతి తెలిసిందే. అందువల్ల ఓటర్ కార్డుకు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు అప్ డేట్ చేసుకుంటే మంచిది.
ఆఫ్ లైన్ తో పాటు ఆన్ లైన్ లో కూడా ఓటర్ కార్డుకు సంబంధించిన అడ్రస్ ను సులభంగా మార్చుకునే అవకాశాలు ఉన్నాయి. ఎక్కువగా కష్టపడకుండానే అడ్రస్ ను మార్చుకోవడం సాధ్యమవుతుంది. ఆన్ లైన్ లో ఓటర్ కార్డ్ అడ్రస్ మార్చుకోవాలని అనుకునే వాళ్లు మొదట https://www.nvsp.in/ వెబ్ సైట్ ను ఓపెన్ చేసి ఆ వెబ్ సైట్ లో వివరాలతో లాగిన్ కావాల్సి ఉంటుంది. లాగిన్ అయిన తర్వాత అందులో forms పై క్లిక్ చేయాలి.
అందులో వేర్వేరు ఫామ్స్ అందుబాటులో ఉండగా form8a పై క్లిక్ చేయాల్సి ఉంటుంది. అందులో రాష్ట్రం, పుట్టినతేదీ, ప్రస్తుత అడ్రస్, పర్మినెంట్ అడ్రస్, నియోజకవర్గం వివరాలను ఎంటర్ చేయాలి. ఇమెయిల్ ఐడీ, మొబైల్ నెంబర్ ను కూడా ఎంటర్ చేసి క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి. ఒకే నియోజకవర్గంలో అడ్రస్ మారితే form 8a వేరే నియోజకవర్గంలోకి అడ్రస్ మార్చాలనుకుంటే form 6 ఉపయోగించాలి.
ఫామ్ ను డౌన్ లోడ్ చేసుకుని ఆ ఫామ్ కు అవసరమైన డాక్యుమెంట్లను జత చేసి ఎన్నికల అధికారి కార్యాలయంలో వాటిని అందజేయాల్సి ఉంటుంది. సబ్మిట్ చేసిన అప్లికేషన్ స్టేటస్ ను తెలుసుకోవాలంటే వెబ్ సైట్ లో track application status పై క్లిక్ చేసి స్టేటస్ ను సులభంగా తెలుసుకోవచ్చు.