Plastic-Eating Insects : కాలుష్యం తర్వాత మనిషి మనుగడను ప్లాస్టిక్ ఇబ్బందికి గురిచేస్తోంది. పెరిగిపోతున్న ప్లాస్టిక్ వినియోగం మనిషి జీవితాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. ప్లాస్టిక్ వల్ల భౌతికపరమైన ఉద్గారాలు పేరుకుపోతున్నాయి. తద్వారా ఏర్పడుతున్న కాలుష్యం అనేక రకాల దుష్పరిణామాలకు కారణమవుతోంది. ప్లాస్టిక్ వినియోగం తప్పనిసరి కావడం.. వినియోగించిన దానిని వృధాగా పడేయడంతో అది అంతిమంగా పర్యావరణం మీద ప్రభావం చూపిస్తోంది. ప్లాస్టిక్ వినియోగం పెరిగిన నేపథ్యంలో.. అది పీల్చే గాలి, అలాగే నీరు, తినే ఆహారం.. ఇలా అన్నింటిలోనూ దాని ఉత్పరివర్తనాలు కనిపిస్తున్నాయి. అందువల్లే మనుషుల్లో రకరకాలైన వ్యాధులు వస్తున్నాయి.. ఇక ప్లాస్టిక్ వినియోగం అధికంగా ఉండడంతో.. అది సముద్ర జలాల్లో చేరి.. జలచరాలను ఇబ్బందులకు గురిచేస్తోంది. ప్లాస్టిక్ ను పొరపాటున మింగి అనేక రకాల జంతువులు కన్నుమూస్తున్నాయి. ప్లాస్టిక్ వల్ల ఏర్పడుతున్న కాలుష్యం జలచరాల మనుగడకే సవాల్ విసురుతోంది. ఈ కాలుష్య ముప్పును నివారించేందుకు ప్రపంచ దేశాలు అనేక రకాల ఒప్పందాలు కుదుర్చుకున్నప్పటికీ ఉపయోగం అంతంతమాత్రంగానే ఉంటున్నది. అయితే ఈ ప్లాస్టిక్ ముప్పును నివారించడానికి శాస్త్రవేత్తలు అనేక రకాల ప్రయోగాలు చేస్తున్నారు. అయితే అవేవీ కూడా ఓ కొలిక్కి వచ్చినట్టు కనిపించడం లేదు. అయితే సూక్ష్మంలో మోక్షం లాగా.. శాస్త్రవేత్తలకు ఇన్నాళ్లకు ఒక శుభవార్త లభించింది.. అదేంటంటే ప్లాస్టిక్ ను తినేసే పురుగులను శాస్త్రవేత్తలు కనిపెట్టారు.
ఇంతకీ ఆ పురుగులు ఏంటంటే..
పర్యావరణానికి ప్లాస్టిక్ అనేది ముప్పుగా మారింది. అది భూమ్మీద ఉన్న సకల జంతుజాతుల మనుగడకు సవాల్ విసురుతోంది. ఈ క్రమంలో కెన్యాలోని మీల్ వార్మ్ అనే పురుగులు ప్లాస్టిక్ ను నిర్మూలించడానికి తోడ్పడతాయని న్యూయార్క్ శాస్త్రవేత్తలు చేస్తున్న పరిశోధనలు తేలింది. ఈ పురుగుల్లో పాలీ స్టయిరిన్ ను విచ్ఛిన్నం చేసే ఎంజైమ్ లు ఉంటాయట. ఇవి వేగంగా ప్లాస్టిక్ ను జీర్ణం చేసుకుంటాయట. అయితే ఈ పురుగులపై మరింత లోతుగా అధ్యయనం చేస్తున్నామని న్యూయార్క్ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఒకవేళ ఈ పురుగులను కనుక మరిత అభివృద్ధి చేస్తే ప్లాస్టిక్ పప్పును త్వరగానే వదిలించుకోవచ్చని శాస్త్రవేత్తలు అంటున్నారు. అయితే ప్లాస్టిక్ ను తింటున్నప్పటికీ ఈ పురుగులు ఎక్కువకాలం జీవిస్తాయట. అయితే ఈ పురుగుల వల్ల మనుషుల మనుగడకు ఎటువంటి ప్రమాదం లేదట. ఇవి కేవలం ప్లాస్టిక్ రేణువులను.. కర్బన సహిత పదార్థాలను మాత్రమే ఆహారంగా తీసుకుంటాయట. అయితే ఇన్నాళ్లు ఈ పురుగులపై ఎవరూ అధ్యయనం చేయలేదు. అయితే న్యూయార్క్ శాస్త్రవేత్తల పరిశోధన వల్ల ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అయితే ఈ పురుగులపై శాస్త్రవేత్తలు మరింత లోతుగా అధ్యయనం చేస్తున్నట్టు తెలుస్తోంది.