Marriage
Marriage: పెళ్లి అనేది జీవితంలో ఒక్కసారి మాత్రమే జరిగే మధుర జ్ఞాపకం. కాలానుగుణంగా మార్పులు వస్తున్నా.. వైవాహిక బంధానికి ఉన్న విలువ తగ్గడం లేదు. ఒకప్పుడు కన్యాశుల్కంతో పెళ్లిళ్లు జరిగేవి. తర్వాత వరకట్నం విధానం వచ్చింది. ఇక పెళ్లిలు గతంలో ఇళ్లలోనే జరిగేవి ఇప్పుడు ఫంక్షన్‌హాళ్లు, గుళ్లు, గోపురాల్లో చేస్తున్నారు. ఇక పెళ్లి వేడుకలకు చేసే ఖర్చు కూడా భారీగా పెరిగింది. ఒకప్పుడు కట్న కానుకలు మాత్రమే ఇచ్చేవారు. ఇప్పుడు ఫొటోలు, వీడియోలు, ప్రీవెడ్డింగ్ షూట్‌తోపాటు అలంకరణకు ప్రాధాన్యం పెరిగింది. ఇంత చేసినా ఇటీవలి కాలంలో కొన్ని బంధాలు కలకాలం ఉండడం లేదు. కారణం ఏదైనా విడిపోయేవారు పెరుగుతున్నారు. పాశ్చాత్య పోకడలతో లివింగ్ టుగెదర్ అంటున్నారు. పెళ్లికి ముందే వద్దంటే తర్వాత సమస్యలు ఉండవు కదా. అయితే కొందరు పెద్దల కోసం, పేరెంట్స్ కోసం, కట్న కానుకల కోసం ముందు పెళ్లికి ఓకే చెబుతున్నారు. తర్వాత నచ్చలేదని విడిపోతున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు పెళ్లి నచ్చకపోయినా.. ఇష్టం లేకపోయినా మేం చెడగొడతామని సంస్థలు పుట్టుకొస్తున్నాయి. ఇప్పుడు వీటికి డిమాండ్ పెరుగుతోంది.
మమ్మల్ని సంప్రదిస్తే చాలు..
ఇటీవలి కాలంలో పెళ్లి ఇష్టం లేనివారు, బలవంతంగా పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది అనేవారు పెరుగుతున్నారు. ఈ నేపథ్యంలో పెళ్లిళ్లు చెడగొట్టే సంస్థలకు డిమాండ్ పెరుగుతోంది. పెళ్లి చేసుకుని కోర్టుల చుట్టూ విడాకుల కోసం తిరగడం కన్నా.. పెళ్లికి ముందే వెడ్డింగ్ డిస్ట్రాయర్స్‌ను సంప్రదించడం మేలని భావిస్తున్నారు. దీంతో ఈ సంస్థలు పెరుగుతున్నాయి. పెళ్లి కుదిర్చడానికి తీసుకున్నట్లుగానే విడగొట్టడానికి కూడా ఈ సంస్థలు కమీషన్ తీసుకుంటాయి. రూ.50 వేల నుంచి రూ.కోటి వరకు వసూలు చేస్తున్నాయట.
విదేశాల్లోనే...
అయితే ఈ వెడ్డింగ్ డిస్ట్రాయర్స్ ఇంకా మన దేశంలోకి రాలేదు. స్పెయిన్, ఇంగ్లండ్ వంటి దేశాల్లో ఈ ట్రెండ్ ప్రారంభమైంది. పెళ్లి చేసుకోవడం నచ్చనివారు, బలవంతంగా పెళ్లి చేసుకునేవారు ఈ సంస్థలను ఆశ్రయిస్తున్నారు. స్పెయిన్‌లో ఏర్పాటు చేసిన ఓ సంస్థకు అయితే భారీగా దరఖాస్తులు వచ్చాయట. దీంతో ఆ సంస్థ ఉద్యోగులను అదనంగా నియమించుకుంటుందట. ఈ ఉద్యోగాలకు కూడా బాగా జీతాలు ఇస్తున్నారట. దీంతో నిరుద్యోగులు ఈ ఉద్యోగానికి కూడా సై అంటున్నారట.
ఎలా చెడగొడతారంటే..
ఇక పెళ్లి చెడట్టడానికి ఈ సంస్థల వద్ద వివిధ ప్లాన్లు ఉంటాయట. పెళ్లి కుదిరిన దశ నుంచి ప్రస్తుతం ఉన్న పొజీషన్ వరకు వివరాలు తీసుకుని ప్లాన్స్ అమలుచేస్తారట. కొందరి పెళ్లిళ్లు పీటల వరకు రాకముందే చెడగొడతారట. కొన్ని పెళ్లిళ్లను సినిమాల్లో లాగా, తాళి కట్టే సమయానికి వచ్చి.. ఆపండ్రా అన్నట్లుగా పెళ్లి ఆపేస్తారట. ఇలా వారికి భిన్నమైన ప్లాన్స్ ఉన్నాయని చెబుతున్నారు.
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read MoreWeb Title: You dont like marriage or not if you contact them they will spoil it
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com