Jyothi Yarraji: తెలుగు తేజం జ్యోతి యర్రాజీ మరోసారి అదరగొట్టారు. తైవాన్ అథ్లెటిక్స్ ఎపెన్2025 లో గోల్డ్ మెడల్ కొల్లగొట్టింది. 100 మీటర్ల హార్డిల్స్ ఫైనల్ ను ఆమె 12.99 సెకన్ల లో పూర్తి చేసి బంగారు పతకం కైవసం చేసుకుంది. చివరి రెండు హార్డిల్స్ వరకు వెనుకంజలో ఉన్న జ్యోతి రెప్పపాటులో అందరినీ దాటుకుంటూ వచ్చి విజేతగా నిలిచారు. మరోవైపు మెన్స్ 110 మీ హార్డిల్స్ లో భారత అథ్లెట్ తేజస్ శీర్సీ సైతం గోల్డ్ మెడల్ సాధించారు.