Homeక్రీడలుక్రికెట్‌Bengaluru Stampede Incident : నిన్న గంభీర్ చురకలు.. నేడు బీసీసీఐ వాతలు.. పాపం ఆర్సీబీ...

Bengaluru Stampede Incident : నిన్న గంభీర్ చురకలు.. నేడు బీసీసీఐ వాతలు.. పాపం ఆర్సీబీ టైం బాగోలేదు!

Bengaluru Stampede Incident : ఇటీవల టీమిండియా కోసి గౌతమ్ గంభీర్ విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. సందర్భంగా విలేకరులు బెంగళూరులో జరిగిన తొక్కిసలాట ఘటనను ప్రస్తావించారు.. దానిపై గౌతమ్ గంభీర్ ఎటువంటి మొహమాటం లేకుండానే స్పందించాడు.. అసలు విజయ యాత్ర నిర్వహించాల్సిన అవసరమేముందని ప్రశ్నించాడు. గతంలో భారత జట్టు పొట్టి ప్రపంచ గెలిచినప్పుడు విజయ యాత్ర నిర్వహించాలి అనుకున్నప్పటికీ.. అప్పట్లో తాను నో చెప్పానని అందువల్ల భారత మేనేజ్మెంట్ ఒప్పుకోలేదని గంభీర్ స్పష్టం చేశాడు.. ఒక ప్లానింగ్ ప్రకారం విజయ యాత్ర ఉండాలని.. అప్పటికప్పుడు అనుకొని విజయ యాత్ర నిర్వహిస్తే పరిణామాలు దారుణంగా ఉంటాయని.. బెంగళూరు ఘటన దానిని రుజువు చేసిందని గంభీర్ స్పష్టం చేశాడు. అసలే తొక్కిసలాట ఘటన బెంగళూరుకు గాయం చేస్తే.. గౌతమ్ గంభీర్ చేసిన వ్యాఖ్యలు దానిమీద కారం పోశాయి.

Also Read : ఈ విషయంలో బెంగళూరు జట్టును అభినందించాల్సిందే.. ఇంతకీ ఏం చేసిందంటే

బిసిసిఎల్ సెక్రటరీ ఏమన్నారు అంటే..

ఇక బెంగళూరు ఘటన నేపథ్యంలో బీసీసీఐ కార్యదర్శి దేవ్ జీత్ సైకియా తొలిసారిగా నోరు విప్పారు.. ఓ ఆంగ్ల మీడియాతో ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. “కొంతలో కొంత సమయం తీసుకుని వేడుకలు గనుక నిర్వహించి ఉంటే ఇంతటి దారుణం జరిగి ఉండేది కాదు.. ఇలాంటి సంఘటనలను చూస్తూ నిశ్శబ్దంగా ఉండలేము.. కన్నడ జట్టు మేనేజ్మెంట్ తొందరపాటు వల్లే ఈ దారుణం జరిగింది. కొంత సమయం తీసుకుని వేడుకలు జరిపితే బాగుండేది. ఈ స్థాయిలో నష్టం జరిగి ఉండేది కాదు. భారత క్రికెట్ నియంత్రణ మండలి ఆధ్వర్యంలో జరిగే సంబరాలను గొప్పగా నిర్వహిస్తాం. దీనికోసం సమయం తీసుకుంటాం. గతంలో దేశ ఆర్థిక రాజధానిలో మేము నిర్వహించిన విజయ యాత్రను అత్యంత పకడ్బందీగా నిర్వహించాం. బెంగళూరులో జరిగింది దారుణం. ఇది ఆ జట్టుకు సంబంధించిన ప్రైవేట్ వ్యవహారం అసలు కాదు. మేము ఇలాంటి సందర్భాలను చూస్తూ ఉండలేం. దేశంలో క్రికెట్ కు సంబంధించిన వ్యవహారాలను మేమే చూస్తాము. వాటిని మేమే పర్యవేక్షిస్తుంటాం. ఇటువంటి సంఘటనలు దేశంలో మళ్ళీ జరగకూడదు.. దానికోసం పకడ్బందీ చర్యలు తీసుకుంటామని” బీసీసీఐ సెక్రటరీ దేవ్ జీత్ సైకియా అన్నారు.

ఇక ఈ ఘటనపై ఇప్పటికే కన్నడ పోలీసులు విచారణ మొదలుపెట్టారు. కేసులు నమోదు చేశారు. ముగ్గురిని అరెస్ట్ చేశారు.. ఇక ఇప్పటికే ఈ ఘటనలో కర్ణాటక రాజధాని పోలీస్ కమిషనర్ ను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ముఖ్యమంత్రి రాజకీయ కార్యదర్శిని కూడా విధుల నుంచి పక్కకు తప్పించారు. మీరు మాత్రమే కాకుండా మరికొంత ఉన్నతాధికారులకు కూడా శ్రీముఖాలు లభించాయి.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular