https://oktelugu.com/

రేవంత్ రెడ్డికి క్షమాపణలు చెప్పిన జగ్గారెడ్డి.. ఎందుకంటే?

తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డిపై విమర్శలు చేసిన జగ్గారెడ్డి తన తప్పు తెలుసుకున్నట్లుగా ప్రకటించారు. తాను అలా మాట్లాడం తప్పేనని పార్టీకి క్షమాపణ చెప్పారు. అయితే జగ్గారెడ్డి వ్యాఖ్యలు పార్టీకి తీవ్రంగా నస్టం కలింగించేలా ఉన్నాయన్న అభిప్రాయంతో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ మాణికం ఠాగూర్ రంగంలోకి దిగారు. ఈ విషయంపై గాంధీభవన్ లో వర్కింగ్ ప్రెసిడెంట్లు, ఉపాధ్యక్షుల సమావేశం నిర్వహించారు. రేవంత్ రెడ్డిపై జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఏఐసీసీ ఇంచార్జి కార్యదర్శులు బోసురాజు, […]

Written By:
  • Velishala Suresh
  • , Updated On : September 25, 2021 / 05:59 PM IST

    Revanth Reddy ignoring seniors

    Follow us on

    తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డిపై విమర్శలు చేసిన జగ్గారెడ్డి తన తప్పు తెలుసుకున్నట్లుగా ప్రకటించారు. తాను అలా మాట్లాడం తప్పేనని పార్టీకి క్షమాపణ చెప్పారు. అయితే జగ్గారెడ్డి వ్యాఖ్యలు పార్టీకి తీవ్రంగా నస్టం కలింగించేలా ఉన్నాయన్న అభిప్రాయంతో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ మాణికం ఠాగూర్ రంగంలోకి దిగారు. ఈ విషయంపై గాంధీభవన్ లో వర్కింగ్ ప్రెసిడెంట్లు, ఉపాధ్యక్షుల సమావేశం నిర్వహించారు. రేవంత్ రెడ్డిపై జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఏఐసీసీ ఇంచార్జి కార్యదర్శులు బోసురాజు, శ్రీనివాస్ కృష్ణన్ లతో పాటు మరో వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ సమావేశం అయ్యారు.

    రేవంత్ పై చేసిన వ్యాఖ్యలకు జగ్గారెడ్డిన వివరణ కోరారు. అయితే జగ్గారెడ్డి ప్రస్ మీట్ పెట్టి విరణ ఇచ్చారు. పార్టీ అంతర్గత విషయాలు తాను మీడియా ముందు మాట్లాడి తప్పు చేశానని అన్నారు. మరోసారి అలాంటి తప్పు చేయనని అన్నారు. తనకు రేవంత్ రెడ్డి సోదరుడు లాంటివాడని అన్నారు. టీఆర్ఎస్, బీజేపీలపై పోరాడటమే తమ విధి అని అన్నారు. అసెంబ్లీ సమావేశాల ప్రారంభం సందర్భంగా మీడియాతో మాట్లాడిన జగ్గారెడ్డి రేవంత్ రెడ్డిపై ఫైర్ అయ్యాడు. రేవంత్ రెడ్డి హీరోయిజం కాంగ్రెస్ లో చెల్లదన్నారు.

    తనకు సమాచారం ఉండడం లేదని.. తనకు రేవంత్ కు గొడవలు ఉన్నాయని మండిపడ్డారు. జగ్గారెడ్డి వ్యాఖ్యలు హైకమాండ్ కు చేరాయి. రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడు అయిన తర్వాత కొంత మంది సీనియర్లు ఆయనతో కలిసి పని చేయడం లేదు. వారిలో ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నారు. పార్టీకి నష్టం కలిగేలా వ్యవహరిస్తే ఊరుకునేది లేదని జగ్గారెడ్డి కి సంకేతాలు ఇచ్చినట్లు తెలుస్తోంది.