
ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న టీమిండియా నేడు కౌంటీ సెలక్ట్ ఎలెవన్ తో ప్రాక్టీస్ మ్యాచ్ లో తలపడుతోంది. మైదనంలోకి దిగిన భారత ఆటగాళ్లు మాజీ క్రికెటర్ యశ్ పాల్ శర్మ మృతికి సంతాపంగా చేతికి నల్లబ్యాడ్జ్ లు ధరించారు. యశ్ పాల్ శర్మ ఈ నెల 13న కార్డియాక్ అరెస్ట్ తో కన్నుమూశారు. 1983 ప్రపంకప్ గెలిచిన జట్టులో యశ పాల్ సభ్యుడు. భారత క్రికెటర్ల నల్లటి బ్యాడ్జ్ లు ధరించిన ఫొటోలను బీసీసీఐ తన ఖాతాలో పోస్టు చేసింది.