ఆ ఐదు రాష్ట్రాల్లోనే 65 శాతం బ్లాక్ ఫంగస్ కేసులు

దేశంలో బ్లాక్ ఫంగస్ పంజా విసురుతోంది. రోజు రోజుకు ఫంగస్ బారినపడ్డ వారి సంఖ్య పెరుగుతోంది. దేశ వ్యాప్తంగా బ్లాక్ ఫంగస్ కేసుల సంఖ్య మొత్తం 11,717 కు చేరిందని కేంద్రం తెలిపింది. ఇందులో 65 శాతం కేసులు కేవలం ఐదు రాష్ట్రాల్లోనే ఉన్నాయని పేర్కొంది. మహారాష్ట్రలో 2,770, గుజరాత్ 2,859, ఆంధ్రప్రదేశ్ 768, మధ్యప్రదేశ్ 752, తెలంగాణలో ఇప్పటివరకు 744 కేసులు ఉన్నాయని చెప్పింది. ఇప్పటి వరకు దేశ రాజధాని ఢిల్లీలో 620 కేసులు నమోదయ్యాయని […]

Written By: Suresh, Updated On : May 26, 2021 3:24 pm
Follow us on

దేశంలో బ్లాక్ ఫంగస్ పంజా విసురుతోంది. రోజు రోజుకు ఫంగస్ బారినపడ్డ వారి సంఖ్య పెరుగుతోంది. దేశ వ్యాప్తంగా బ్లాక్ ఫంగస్ కేసుల సంఖ్య మొత్తం 11,717 కు చేరిందని కేంద్రం తెలిపింది. ఇందులో 65 శాతం కేసులు కేవలం ఐదు రాష్ట్రాల్లోనే ఉన్నాయని పేర్కొంది. మహారాష్ట్రలో 2,770, గుజరాత్ 2,859, ఆంధ్రప్రదేశ్ 768, మధ్యప్రదేశ్ 752, తెలంగాణలో ఇప్పటివరకు 744 కేసులు ఉన్నాయని చెప్పింది. ఇప్పటి వరకు దేశ రాజధాని ఢిల్లీలో 620 కేసులు నమోదయ్యాయని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు.