
కరోనా వైరస్ అన్ని రంగాలను చిన్నాభిన్నం చేసింది. ముఖ్యంగా సినీ పరిశ్రమను కోలుకోలేకుండా చేసింది. దాదాపు రెండు సంవత్సరాలుగా సినీ ఇండస్ట్రీలో నష్టాలు తప్ప లాభాలు వచ్చే అవకాశం లేకుండా పోయింది. ఈ తరుణంలో స్టార్ హీరోలతో బుల్లితెరపై ప్రత్యేక షో నిర్వహించాలనుకున్నవారికి కూడా ఎదురుదెబ్బలే తగులుతున్నాయి. టాలీవుడ్ సూపర్ స్టార్ ఎన్టీఆర్ తో కలిసి ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ ప్రొగ్రాం నిర్వహించేందుకు జెమినీ టీవీ ప్లాన్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ షో నిర్వాహకులు ఇప్పుడు తీవ్ర నిరాశలో ఉన్నారట. ఎందుకంటే..?
ప్రస్తుత పరిస్థితులు మెరుగయ్యే సరికి మరో రెండు నెలలు పట్టే అవకాశం ఉంది. అయితే గత రెండు నెలల కింద ఎంతో హైప్ తో జూనియర్ తో మీలో ఎవరు కోటీశ్వరుడు ప్రొగ్రాం కోసం నిర్వాహకులు రకరకాల ప్లాన్లు వేశారు. ఈ ప్రొగ్రాంతో రికార్డు బ్రేక్ చేయొచ్చనే ఆలోచనలో ఉన్నారు. ఇందులో భాగంగా ఎన్టీఆర్ కూడా ప్రత్యేకంగా ఓ ఇంటర్వ్యూ ఇచ్చి ప్రొగ్రాం గురించి చెప్పారు. అయితే కరోనా కారణంగా ఆ ప్రసారం ఆగిపోయింది.
ఒకవేళ కరోనా ఉధృతి తగ్గినా ఎన్టీఆర్ సినిమాలతో బిజీ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో సుధీర్ఘంగా షెడ్యూల్ కేటాయించిన జూనియర్ ఆ సినిమా పూర్తయ్యేసరికి ఇతర వాటికి కేటాయించే పరిస్థితి లేదు. అయితే ఆ తరువాత ఎన్టీఆర్ చేతిలో రెండు, మూడు సినిమాలు కూడా ఉండడంతో ఇక ‘కోటీశ్వరుడు’ ప్రొగ్రాం అనుకున్నట్లు ఆగస్టులో ప్రారంభమయ్యే అవకాశం లేనట్లేనని తెలుస్తోంది.
బుల్లితెరపై జూనియర్ సందడి చూద్దామని ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు. కానీ అనుకున్నట్లు జరగకపోవడంతో నిర్వాహాకులు నిరాశతో ఉన్నారు. ఇదిలా ఉండగా ఇప్పటికే ఎన్టీఆర్ కు భారీ రెమ్యూనరేషన్ చెల్లించినట్లు తెలుస్తోంది. అయితే ఎన్టీఆర్ డేట్స్ ఎప్పుడు కుదురుతాయోనని నిర్వాహకులు ఆందోళన చెందతున్నారు.