Homeవార్త విశ్లేషణSiddharth Marriage: రెండేళ్లుగా సహజీవనం.. ఇప్పుడు రహస్యంగా వివాహం.. టాలీవుడ్ హీరో సంచలనం

Siddharth Marriage: రెండేళ్లుగా సహజీవనం.. ఇప్పుడు రహస్యంగా వివాహం.. టాలీవుడ్ హీరో సంచలనం

Siddharth Marriage: అతడిది తమిళం అయినప్పటికీ.. తెలుగు వాళ్ళు ఓన్ చేసుకున్నారు. ఇక్కడ స్ట్రెయిట్ సినిమాలు చేయడం.. అవి సూపర్ హిట్ కావడంతో తెలుగు ప్రేక్షకులు బ్రాహ్మ రథం పట్టారు. తమిళ ప్రేక్షకుల కంటే అతడిని ఎక్కువగా అభిమానించారు. ఆ కథానాయకుడు ప్రస్తుతం వార్తల్లో వ్యక్తయ్యాడు. గతంలో అతడికి రెండు వివాహాలు జరిగాయి. లెక్కకు మిక్కిలి ప్రేమ వ్యవహారాలున్నాయి.. అయితే రెండు సంవత్సరాల క్రితం ఓ సినిమాలో నటిస్తుండగా.. అందులో హీరోయిన్ తో అతడు మరోసారి ప్రేమలో పడ్డాడు. అలాగని ఆమెకు ఇదే తొలిప్రేమ కాదు. గతంలో ఆమె ఓ యువకుడిని ప్రేమించింది. పెళ్లి చేసుకుంది. కానీ ఎందుకో ఆ బంధం నిలబడలేదు. ఫలితంగా అందులో నుంచి ఆమె బయటికి వచ్చేసింది. గ్లామర్ ఫీల్డ్ లోకి రీ ఎంట్రీ ఇచ్చింది.. కొద్దిరోజులుగా ఆ కథానాయకుడు, ఈమె రిలేషన్ లో ఉన్నారు..బుధవారం అత్యంత రహస్యంగా పెళ్లి చేసుకున్నారు.

వనపర్తి జిల్లా శ్రీరంగాపూర్ రంగనాథ స్వామి దేవాలయంలో టాలీవుడ్ హీరో సిద్ధార్థ్, హీరోయిన్ అదితి రావు హైదరి ఏడడుగులు వేశారు. అత్యంత రహస్యంగా వీరి వివాహం జరిగింది. ఇరు వర్గాలకు చెందిన కుటుంబాలు, అత్యంత సన్నిహితుల మధ్య ఈ వివాహ వేడుక జరిగింది. తమిళనాడు రాష్ట్రానికి చెందిన పురోహితులు ఈ పెళ్లి తంతును జరిపించారు. ఈ వివాహ వేడుక గురించి అటు సిద్ధార్థ్, ఇటు అదితి ఎవరికీ చెప్పలేదు. కాకుంటే ఇక్కడే ఎందుకు పెళ్లి చేసుకున్నారనే ప్రశ్న అందరి నోట్లో నానుతోంది..

అదితి వనపర్తి సంస్థానాధిపతుల వారసుల్లో ఒకరు. ఆమె పూర్వికులు వనపర్తి ప్రాంతాన్ని ఏలారు. అదితి పుట్టింది హైదరాబాదులోనే. ఆ తర్వాత ఆమె తన మకాం ఢిల్లీకి మార్చారు. కొద్దిరోజుల తర్వాత ముంబాయికి షిఫ్ట్ అయ్యారు. అక్కడ ముందు కొన్ని ఫ్యాషన్ షోలలో పాల్గొన్నారు. ఆ తర్వాత గ్లామర్ ఫీల్డ్ లోకి ఎంటర్ ఇచ్చారు. కాగా మహాసముద్రం సినిమా షూటింగ్ సమయంలోనే సిద్ధార్థ్, అదితి మధ్య ప్రేమ మొదలైంది. ఆ తర్వాత వీరు చాలాకాలంగా సహజీవనం కొనసాగించారు. ఇద్దరు కలిసి ఈవెంట్లకు, వివిధ పార్టీలకు వెళ్తున్నారు. అక్కడ దిగిన ఫోటోలను తమ సోషల్ మీడియా ఖాతాలలో పోస్ట్ చేస్తున్నారు. దీని ద్వారా తమ మధ్య బంధం ఉందని వారు చెప్పకనే చెప్తున్నారు. ఇక మీడియాలో వీరి గురించి వార్తలు వస్తూనే ఉన్నాయి. పెళ్లి గురించి అడిగితే మాత్రం ఇద్దరూ సమాధానం దాటవేస్తూ వచ్చారు.

చివరిగా బుధవారం వనపర్తి లో అత్యంత రహస్యంగా పెళ్లి చేసుకొని అందరికీ సర్ ప్రైజ్ ఇచ్చారు. ఇక ఈ విషయం తెలుసుకున్న అభిమానులు వారిద్దరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. బాయ్స్, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, బొమ్మరిల్లు, యువ, చుక్కల్లో చంద్రుడు, జబర్దస్త్ వంటి సినిమాల ద్వారా సిద్ధార్థ్ తెలుగువారికి సుపరిచితమే. ఇతడికి ఇది రెండో పెళ్లి. 2003లో మేఘన అనే యువతని సిద్ధార్థ్ పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరి మధ్య మనస్పర్ధలు ఏర్పడటంతో 2007లో విడాకులు తీసుకున్నారు. ఈ జంటకు ఒక కుమారుడున్నాడు. అతని బాధ్యతలను సిద్ధార్థ్ చూసుకుంటున్నాడని సమాచారం. ఆ తర్వాత సోహ అలీ ఖాన్, శృతిహాసన్, సమంత వంటి వారితో సిద్ధార్థ్ ప్రేమ వ్యవహారాలు నడిపినట్టు పుకార్లు వినిపించాయి. అవేవీ నిజం కావని సిద్ధార్థ్ అభిమానులు స్పష్టం చేశారు. చివరికి అదితి తో ప్రేమలో పడి వివాహం చేసుకున్నాడు. ఆమెకు కూడా ఇది రెండవ వివాహం. మహాసముద్రం సినిమా షూటింగ్ సమయంలోనే వీరిద్దరూ ప్రేమలో పడినట్టు తెలుస్తోంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular