
తౌక్టే తుఫాను కర్టాటకలో బీభత్సం చేస్తోంది. తీర ప్రాంతంలోని ఆరు జిల్లాలు, మల్నాడ్ లో భారీ వర్షపాతం నమోదైందని కర్ణాటక రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ ఆదివారం తెలిపింది. తుఫానుకు 73 గ్రాములు ప్రభావితమయ్యాయని ఇప్పటి వరకు నలుగురు మరణించారని అధికారులు పేర్కొన్నారు. తౌక్టే అతి తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉందని ఈ నెల 18న ఉదయం గుజరాత్ వద్ద తీరం దాటుతుందని భారత వాతావరణ శాఖ తెలిపింది.