
కరోనా కల్లోలం అడ్డుకోవడానికి యూరోపియన్ యూనియన్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. భారత్ నుంచి అనవసర ప్రయాణాలపై తాత్కాలిక నిషేధం విధించాలని ఈయూ దేశాలకు సూచించింది. భారత్ లో విస్తరించిన బీ.617.2 వేరియంట్ను వేరియంట్ ఆప్ కనర్న్ గా ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించినందున ముందుజాగ్రత్తగా తాము ఈ నిర్ణయం తీసుకున్నామని ఈయూ కమిషన్ తెలిపింది.