
రాష్ట్రంలో మే 31వ తేదీ వరకూ రెండో డోస్ వారికే వ్యాక్సిన్ ఇవ్వనున్నట్లు డీహెచ్ శ్రీనివాసరావు తెలిపారు. మీడియాతో గురువారం మాట్లాడుత రెండో డోసుకు రిజిస్ట్రేషన్ అవసరం లేదని నేరుగా వ్యాక్సిన్ కు వెళ్ల వచ్చన్నారు. రాష్ట్రంలోని ఆస్పత్రుల్లో పడకల కొరత లేదన్నారు. ప్రస్తుతం 5,783 ఆక్సిజన్ పడకలు 17,267 ఐసీయూ పడకలు ఖాళీగా ఉన్నట్లు తెలిపారు. ప్రైవేటు ఆస్పత్రులు ఆక్సిజన్ ను సక్రమంగా వినియోగించాలని సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రల్లో ఔషధాలకు ఎలాంటి కొరత లేదన్నారు. రెమ్ డెసివిర్ వంటి ఔషదాలు వైద్యుల సలహా మేరకే వాడాలన్నారు.