Revanth Reddy : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి రాజయోగం పట్టిందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కాంగ్రెస్ పార్టీకి సీనియర్ నాయకులు ఉన్నారు. వారంతా పార్టీ పుట్టినప్పటి నుంచి దాన్నే నమ్ముకొని బతికారు. కానీ సీఎం అయ్యే అవకాశం మాత్రం రేవంత్ రెడ్డికి దక్కింది. కాంగ్రెస్ పార్టీ కూడా ఊహించని విజయాన్ని అందుకుంది. రేవంత్ కాంగ్రెస్ పార్టీలో చేరిప్పటి నుంచి స్వపక్షంలో విపక్షం ఎదురైంది. తెలంగాణ సీనియర్ నాయకులను దాటుకొని, ఢిల్లీ స్థాయిలో పార్టీ పెద్దలను ప్రసన్నం చేసుకొని తనను అవమానించిన వారి ముందే తలెత్తుకు తిరుగుతున్నాడు.
కానీ ఆయన సీఎం పదవి వైకుంఠపాళి ఆటగా కనిపిస్తుంది.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి కాబోతున్న సందర్భంగా రేవంత్ సాధించింది ఏంటి? అని తెలుసుకుంటే.. ప్రభుత్వం ఏర్పాటు చేయడంతోనే దొరల ప్రభుత్వం కాదని ప్రజా ప్రభుత్వం అంటూ ప్రగతి భవన్ కు గత పాలకులు వేసిన ఇనుప కంచెలను తొలగించి ప్రజా భవన్ గా మార్చి ప్రజా దర్బార్ కొనసాగించారు. దీంతో ప్రజల దృష్టిని ఆకర్షించి పెద్ద నిచ్చెన ఎక్కాడు. ఆ తర్వాత నాలుగు నెలలు అసమ్మతులను సంతృప్తి పరచడం, ప్రత్యర్థి పార్టీలకు చెందిన నేతలను కాంగ్రెస్ లోకి ఆహ్వానించడం వంటివి చేసి గత పాలకుల వల్లే పాలన సాగుతుందని పామునోట్లో పడ్డాడు.
ఇక, ఆ తర్వాత హైద్రాబాద్ కు పూర్వ వైభవం అంటూ హైడ్రా, మూసీకి సుందరీకరణ అంటూ కూల్చివేతలకు శ్రీకారం చుట్టి మన్ననలు పొందారు. మొదట సెలబ్రెటీ అయిన నాగార్జున ఎన్ కన్వెన్షన్ కూల్చివేసి వైకుంఠ పాళిలో నిచ్చెన ఎక్కారు. హైడ్రా కూల్చివేతలు ఎక్కువవడంతో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చి వచ్చింది. దీంతో పాటు గ్రూప్ 2 ఉద్యోగార్థుల నుంచి నిరసనలు పెరగడం, వారిపై పోలీసుల వ్యవహారం కూడా ప్రభుత్వం మెడకు చుట్టుకొని మళ్లీ కిందికి పడిపోయారు. ప్రభుత్వం ఏర్పడి 10 నెలలు పూర్తయినా హైద్రాబాద్ బ్రాండ్ వాల్యూను పైస్థాయికి తీసుకువెళ్లే కంపెనీలను రాష్ట్రానికి తీసుకురాలేకపోయింది. అనే వాదన హైద్రాబాద్ యువతలో కనిపిస్తుంది.
బీఆర్ఎస్ అవినీతిని బయటపెడతామని వారిపై చట్టరిత్యా చర్యలు తీసుకుంటామని చెప్పుకొచ్చిన రేవంత్ ప్రకటనలు ఇంకా కార్యరూపం దాల్చలేదు. దీనికి తోడు కొందరు మంత్రులు చేసిన అసభ్యకర ప్రకటనలను సీఎం ఖండించకపోవడం ఒక వర్గంలో వ్యతిరేకతకు కారణమైంది. ఒక్కోసారి దూకుడుతో ప్రత్యర్థి పార్టీలను కట్టడి చేసి వారిని డిఫెన్స్ లో నెట్టగల సమర్థత రేవంత్ వద్ద ఉంది. ఇదే దూకుడు ప్రత్యర్థి చేతికి అస్త్రాలు ఇస్తుంది. రేవంత్ కు వాక్చాతుర్యం, రాజకీయ అనుభవం ఉన్నా.. పాలనా పరంగా అనుభవం లేకపోవడంను చూస్తే రేవంత్ రాజకీయం పైకిలేస్తూ, కిందకు పడుతూ వైకుంఠపాళిని తలపిస్తోంది.
Mahendra is a Senior Political Content writer who has very good knowledge on Business stories. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Due to the lack of inexperience in terms of governance revanth reddys politics is up and down
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com