Rythu Dinotsavam 2024: వ్యవసాయంలో ఏముంది. రెక్కలు ముక్కలు చేసుకోవాలి. ఎంత కష్టపడినా లాభం ఉండదు. ఎప్పుడూ నష్టమే. కష్టం తప్ప లాభం లేనిది వ్యవసాయం. ఇవీ రైతుల చెప్పే మాటలు. రైతులను ఆదుకోవడానికి ప్రభుత్వాలు అనేక పథకాలు ప్రారంభించాయి. పెట్టుబడి సాయం కూడా చేస్తున్నాయి. తక్కువ వడ్డీకి రుణాలు సైతం ఇస్తున్నాయి. అయినా రైతులు సక్సెస్ కావడం లేదు. ఇందుకు అనేక కారణాలు ఉన్నాయి. కానీ, కొందరు రైతులు సాగునే లాభసాటిగా మార్చుకుంటున్నారు. వ్యవసాయాన్ని కొత్త పుంతలు తొక్కిస్తున్నారు. లక్షల రూపాయలు సంపాదిస్తున్నారు. గుర్తింపు తెచ్చుకుంటూ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ప్రకృతి వ్యవసాయంతోపాటు గేదెల పెంపకం, చేపల పెంపకం, కోళ్ల పెంపకంతో మంచి ఆదాయం పొందుతున్నారు.
రైతు దంపతులు.. లక్షల్లో ఆదాయం..
నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం గాంధీనగర్ గ్రామానికి చెందిన అనిత–జైపాల్‌రెడ్డి దంపతులు. వీరు వినూత్న పద్ధతిలో వ్యవసాయం చేస్తున్నారు. మహిళా సంఘం నుంచి ఆర్థికసాయం పొంది పశువుల పెంపకం, కోళ్ల పెంపకం, చేపల పెంపకం చేపట్టారు. గేదెల నుంచి రోజుకు 50 లీటల్ల పాలు తీసి విక్రయిస్తున్నారు. కోళ్లు విక్రయిస్తూ, గుడ్డు అమ్ముతూ సంపాదిస్తున్నారు. మరోపక్క నాలుగు గుంటల్లో చేపలు పెంచుతున్నారు. తమకున్న మూడెకరాల్లో చిన్న ఇళ్లు, పశువుల షెడ్డు, కోళ్ల షెడ్డు వేశారు. పశువుల పేడ, మూత్రం వృథా కాకుండా వ్యవసాయానికి వినియోగిస్తున్నారు. దీంతో ఎలాంటి రసాయనాలు లేకుండా పంటలు పండిస్తున్నారు. గెదెల పాలతో నెలకు రూ.1.20 లక్షలు, కోళ్ల పెంపకం, విక్రయంతో నెలకు రూ.40 వేలు, చేపల పెంపకం, విక్రయం ద్వారా మరో 20 వేలు సంపాదిస్తున్నారు.
సాఫ్ట్‌వేర్ ఉద్యోగం వదిలి..
ఐదు అంకెల జీతం వచ్చే సాఫ్ట్‌వేర్ కొలువు కోసం ఎంతో మంది ఎదురు చూస్తున్నారు. పోటీ పడుతున్నారు. అయితే అదేరంగంలో ఉన్నవారు భిన్నంగా ఆలోచిస్తున్నారు. ఓ యువకుడు సాఫ్ట్‌వేర్ కొలువు వదిలేసి సాగుబబాట పట్టాడు. అద్భుతాలు చేస్తున్నాడు. ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం ధనోర గ్రామానికి చెందిన నారా శ్రీనివాస్‌యాదవ్ ఎంటెక్ పూర్తిచేసి హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేసేవాడు. నగర జీవనం కన్నా గ్రామంలో అమ్మానాన్నతో కలిసి వ్యవసాయం చేయాలనుకున్నాడు. ఉద్యోగం వదిలేసి డిగ్రీ వరకు చదువుకున్న తన సోదరుడు వెంకటరమణతో కలిసి తమ సాగు భూమిలో వ్యవసాయం మొదలు పెట్టారు.
కరీంనగర్ యువ రైతు..
తమ పిల్లలు వ్యవసాయం చేయవద్దని రైతులు భావిస్తున్నారు. కానీ, ఆధునిక పద్ధతిలో వ్యవసాయం చేస్తే అంతకన్నా గొప్ప ఉద్యోగం లేదంటున్నారు యువకులు. ఉన్నత చదువులు చదవి కూడా ఉద్యోగం చేయకుండా సాగుబాట పడుతున్నారు. కరీంనగర్‌కు చెందిన యువ రైతు మాపురం మల్లికార్జున్‌రెడ్డి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ అవార్డుకు ఎంపికయ్యాడు. సాఫ్ట్‌వేర్ ఉద్యోగం వదిలి వ్యవసాయం మొదలు పెట్టాడు. వ్యవసాయంలో అద్భుతాలు సృష్టించాడు. చొప్పదండి మండలం పెద్దకుర్మపల్లికి చెందిన మల్లికార్జునరెడ్డి 2006లో సాఫ్‌టవేర్ ఉద్యోగంలో చేరారడు. 2010లో సంధ్య ఎంబీఏ చేసిన యువతిని పెళ్లి చేసుకున్నాడు. 2014లో ఇద్దరూ ఉద్యోగాలు వదిలేసి గ్రామానికి వచ్చారు.
12 ఎకరాల్లో సాగు..
వ్యవసాయం చేయాలని నిర్ణయించుకుని తమకు ఉన్న 12 ఎకరాల్లో పంటలు ఆర్గానిక్ పద్దతిలో సాగు చేయడం ప్రారంభించారు. లాభాలు రావడంతో మరో ఐదు ఎకరాలు లీసుకు తీసుకుని లాభాలు గడించారు. 17 ఎకరాల భూమిలో జింక్ రైతస్, బ్లాక్ రైస్ వంటి విదేవీ వంగడాలు సాగుచేసి సక్సెస్ అయ్యారు. దీంతో అతడిని ఐసీఏఆర్ అవార్డు వరించింది.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read MoreWeb Title: Rythu dinotsavam the ideal is this farmer couple income of lakhs of rupees per month what is their success story
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com