KTR : తెలంగాణలో ఎన్నికల ముగిసి ఏడాది గడిచినా.. అధికార కాంగ్రెస్, విపక్ష బీఆర్‌ఎస్ మధ్య మాటల యుద్ధం ఆగడం లేదు. విమర్శలు, ప్రతివిమర్శలతో రాజకీయాలు గరం గరంగా సాగుతున్నాయి. ప్రజలు బీఆర్‌ఎస్‌ను ఓడించినా.. తము ఇంకా అధికర పక్షమే అన్నట్లుగా కాంగ్రెస్ సర్కాన్ నిర్ణయాలను గుడ్డిగా తప్పు పడుతున్నారు. ఏ కార్యక్రమం మొదలు పెట్టినా అడ్డుకోవడం విమర్శించడమే తమ విధి అన్నట్లు కేటీఆర్, హరీశ్‌రావు రచ్చ చేస్తున్నారు. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఇబ్బంది పడుతోంది. ఈ నేపథ్యంలో కేటీఆర్ టార్గెట్‌గా రేవంత్ సర్కార్ పావులు కదుపతోంది. ఈ క్రమంలో ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో రూ.50 కోట్ల గోల్‌మాల్ వ్యవహారంలో కేటీఆర్‌ను ఆరెస్టు చేయాలని భావిస్తోంది. కేటీఆర్‌ను జైలుకు పంపితే హరీశ్‌రావు సైలెంట్ అవుతారని హస్తం పార్టీ ఆలోచన. ఈ క్రమంలోనే మీడియకు రాష్ట్ర ప్రభుత్వం లీకులు ఇస్తోంది. తాజాగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కూడాదీనిపై స్పందించారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని స్పష్టం చేశారు. రాష్ట్ర మంత్రివర్గ సమావేశం తర్వాత మంత్రి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కీలకంగా మారాయి. ఈ కార్ రేసుపై కేబినెట్‌లో చర్చించామని తెలిపారు. గవర్నర్ అనుమతిని ఏసీబీకి పంపాలని కేబినెట్ నిర్ణయించింది. ఈమేరు చీఫ్ సెక్రెటరీ ఆదేశాలు ఇచ్చారు.
అరవింద్ కుమార్‌పైనా..
ఈ కేసులో రూ.50 కోట్లు బదిలీ చేసిన ఐఏఎస్ అధికారి అరవింద్‌కుమార్‌పైనా చర్యలకు ఏసీబీ సిద్ధమవుతోంది. ఈమేరకు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. కేటీఆర్ నోటి మాటగా ఆదేశిస్తే హెచ్‌ఎండీఏ ఉన్నతాధికారిగా అరవింద్‌కుమార్ రూ.50 కోట్లు బదిలీ చేయడాన్ని రేవంత్ సర్కార్ సీరియస్‌గా పరిగణిస్తోంది. ఆ తర్వాత కూడా చట్టపరమైన ప్రక్రియ పూర్తి చేయకపోవడంతో అక్రమంగా తరలించినట్లు అయింది.
గవర్నర్ అనుమతి రాకతో..
కేటీఆర్ విచారణకు గవర్నర్ అనుమతి కోరింది రేవంత్ సర్కార్.. అక్టోబర్‌లోనే ఈమేరకు విన్నవించగా, ఎట్టకేలకు అనుమతి వచ్చింది. దీంతో రేవంత్ సర్కార్ చర్యలకు దిగుతోంది. ఏసీబీని రంగంలోకి దించబోతోంది. విచారణకు పిలిపించి అరెస్టు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే మీడియాకు లీకులు ఇస్తున్నట్లు అర్థమవుతోందని విశ్లేషకుల పేర్కొంటున్నారు. అయితే అరెస్టు విషయంలో ఎలాంటి వ్యూహం అనుసరిస్తారన్నది తెలియడం లేదు.