KTR: తెలంగాణలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్‌ఎస్ మధ్య మరోమారు రచ్చ మొదలైంది. ఈ కార్ రేసు వ్యవహారంలో అనుమతి లేకుండా నిధులు కేటాయించడంపై మాజీ మంత్రి కేటీఆర్‌పై ఏసీబీ కేసు నమోదు చేసింది. దీంతో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం మొదలైంది.
‘రేవంత్‌రెడ్డీ.. ఏ కేసు పెట్టుకుంటవో పెట్టుకో.. ఎన్ని తప్పుడు కేసులు పెట్టుకుంటవో పెట్టుకో.. కేసులకు భయపడం..’
‘రేవంత్‌రెడ్డీ.. నేను ఎక్కడికీ పారిపోలేదు. హైదరాబాద్‌లోనే ఉన్నా.. అరెస్టు చేసుకుంటే చేసుకో. నెలో రెండు నెలలో జైల్లో ఉంటా. యోగా చేస్తా. బెయిల్‌పై వచ్చి పాదయాత్ర చేస్తా’
‘నేను ఎలాంటి తప్పు చేయలేదు.. తెలంగాణ ఇమేజ్ పెంచేందుకే డబ్బులు చెల్లించాం. దాంతో తెలంగాణకు లాభమే కలిగింది. తప్పుడు కేసులకు భయపడను. కేసు పెట్టి అరెస్టు చేస్తే బెయిల్ కోసం కోర్టుకు కూడా వెళ్లను’
ఇవీ.. మొన్నటి వరకు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మాజీ ముఖ్యమైన మంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు మీడియా ముఖంగా చేసిన ప్రకటనలు, ట్విట్టర్ వేదికగా చేసిన ట్వీట్లు. కానీ, ఈ ఫార్ములా వ్యవహారంపై కేటీఆర్‌ను విచారణ చేసేందుకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అనుమతి ఇచ్చారు. దీంతో వెంటనే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేటీఆర్‌పై కేసు నమోదుకు ఏసీబీకి లేఖ రాశారు. వెంటనే రంగంలోకి దిగిన ఏసీబీ గురువారం(డిసెంబర్ 19న) కేటీఆర్‌పై కేసు నమోదు చేసింది. తెలంగాణలో అసెంబ్లీ జరుగుతుండగానే కేటీఆర్‌ను ఏ1గా, అరవింద్‌కుమార్‌ను ఏ2గా, ఏ3గా బీఎల్‌ఎన్ నర్సింహారెడ్డిని చేరుస్తూ పీసీ యాక్ట్, ఐపీసీ 409, 120–బీ సెక్షన్లు నమోదు చేశారు. కేసు పెడితే కోర్టుకు వెళ్లనని చెప్పిన కేసీఆర్.. కేసు నమోదు చేసి 24 గంటలు కూడా కాక ముందే.. హైకోర్టును ఆశ్రయించారు. తనపై నమోదు చేసిన కేసును క్యాష్ చేయాలని, భోజనం తర్వాత పిటిషన్‌పై విచారణ జరపాలని కోర్టును కోరారు. ఈ పిటిషన్ న్యాయమూర్తి శ్రవణ్‌కుమార్ బెంచ్ ముందుకు విచారణకు వచ్చే అవకాశం ఉంది.
కేటీఆర్‌లో భయం మొదలైందా..
తాను జైలుకు వెళ్లడానికి కూడా సిద్ధమని గతంలో పలుమార్లు ప్రకటించి రేవంత్‌రెడ్డిని కవ్వించిన కేటీఆర్.. ఇప్పుడు కేసు నమోదు చేయగానే భయపడుతున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ఒకటి కాదు రెండు కాదు రూ.56 కోట్లు ఎలాంటి అనుమతి లేకుండా కేటాయించడం చట్ట ప్రకారం నేరం. దీనిని రిజర్వు బ్యాంకు ఇప్పటికే నిర్ధారించింది. రాష్ట్ర ప్రభుత్వానికి రూ.8 కోట్ల జరిమానా కూడా విధించింది. ఈ నేపథ్యంలో ఈ ఫార్ములా కేసులో కేటీఆర్ ఇరుక్కుపోయారు. న్యాయపరంగా ఆయనకు చిక్కులు తప్పవు. దీంతో కేటీఆర్ ఇప్పుడు భయంతోనే అరెస్టు చేయకముందే కోర్టును ఆశ్రయించారు.
ఇప్పటికీ బుకాయింపే..
అక్రమంగా నిధులు కేటాయించడమే కాకుండా దానిని కప్పి పుచ్చుకునేందుకు అనేక సాకులు చెబుతున్నారు. విదేశాల్లో ఎక్కడో జరిగిన విషయాన్ని ఇక్కడ ఉదహరిస్తున్నారు. ఫార్ములా రేస్ రద్దుతో తెలంగాణ ప్రతిష్టను కాంగ్రెస్ ప్రభుత్వం దెబ్బతీసిందని ఆరోపిస్తున్నారు. నిధులు కేటాయించడం తప్పని ప్రభుత్వం చెబుతుంటే.. ఆయన ఈ ఫార్ములా, తెలంగాణ అభివృద్ధి జరిగిందని చెప్పుకొస్తున్నారు. కేటాయించిన తర్వాత అనుమతి ఎందుకు తీసుకోలేదో కూడా వెల్లడించడం లేదు. కానీ తప్పు చేయలేదని, హెచ్‌ఎండీఏ నిధులు ఎవరికైనా కేటాయించే అధికారం ఉందని పేర్కొంటున్నారు.