SIP Calculator: మీరు మీ సంపాదనలో ఎంతో కొంద ఆదా చేస్తున్నారా? పెట్టుబడులకు ప్రాధాన్యత ఇస్తున్నారా లేదా? పదవీ విరమణ సమయంలో ఆర్థిక సమస్యలు రాకుండా ఉండాలంటే చిన్నప్పటి నుంచే పెట్టుబడి పెట్టడం మంచిది. ఇందుకోసం పొదుపును అలవర్చుకోవాలి. దీనికి చాలా ఆప్షన్లు ఉన్నప్పటికీ మ్యూచువల్ ఫండ్స్ మంచి ఆప్షన్ అని నిపుణులు చెబుతున్నారు. కాలం గడుస్తున్న కొద్దీ సంపద ఊహించని రీతిలో పెరుగుతుంది. ఇక్కడ తొలినాళ్లలో పెద్దగా ప్రయోజనం ఉండదు.. ఏళ్లు గడుస్తున్నా కొద్ది పెట్టుబడిపై చక్రవడ్డీ రూపంలో వడ్డీపై వడ్డీ వస్తుంటుంది. మ్యూచువల్ ఫండ్లలో ఏకమొత్తం అంటే మీరు మొత్తం మొత్తాన్ని ఒకేసారి పెట్టుబడి పెట్టవచ్చు. లేదా మీరు సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (SIP) ద్వారా కూడా పెట్టుబడి పెట్టవచ్చు. వీటిలో సగటు వార్షిక ప్రాతిపదికన 15 శాతం కంటే ఎక్కువ రాబడిని ఇచ్చిన అనేక పథకాలు ఉన్నాయి. ఇక్కడ రాబడులు మార్కెట్ రిస్క్‌కు లోబడి ఉంటాయి కాబట్టి రిస్క్‌ను బట్టి ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఆర్థిక నిపుణుల సలహాలు తీసుకుని పెట్టుబడులు పెట్టడం వల్ల కొంత నష్టాన్ని తగ్గించుకోవచ్చు. మంచి పథకాలను ఎంచుకునే అవకాశం ఉంది. ఇందుకోసం గతంలో మంచి రాబడినిచ్చిన పథకాలపై అవగాహన పెంచుకోవాలి.
పెట్టుబడికి ప్రధాన వనరు స్టాక్ మార్కెట్. దీర్ఘకాలిక పెట్టుబడి ఊహించని రాబడిని ఇస్తుంది. కానీ ఇక్కడ ప్రమాదం కూడా ఉందని గమనించాలి. అదే విధంగా కొందరు మ్యూచువల్ ఫండ్స్ ద్వారా కోట్లకు పడగలెత్తుతున్నారు. మీరు SIP ద్వారా ప్రతి నెలా కొంత మొత్తాన్ని పెట్టుబడి పెట్టవచ్చు. దీర్ఘకాలంలో మంచి రాబడిని పొందవచ్చు. మీరు కోటీశ్వరులు కావాలనుకుంటే? ప్రతి నెలా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో డబ్బు పెట్టడం ద్వారా దీర్ఘకాలం వేచి ఉంటే సరిపోతుంది.
SIP భారీ సంపదను సృష్టించడంలో దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాలను సాధించడంలో సహాయపడుతుంది. మీ స్థోమతను బట్టి ఇందులో పెట్టుబడి పెట్టవచ్చు. రోజుకు 10 రూపాయలు ఆదా చేయడం ద్వారా కూడా మీరు కోటీశ్వరులు కావచ్చు. మీరు SIPలో రోజుకు 10 రూపాయలు అంటే నెలకు 300 రూపాయలు పెట్టుబడి పెట్టాలి. కేవలం రూ. 300 SIPని ప్రారంభించవచ్చు. దీర్ఘకాలంలో 15 నుంచి 20 శాతం రాబడి వస్తుందని గత నివేదికలు స్పష్టం చేశాయి. 40 ఏళ్లపాటు పెట్టుబడికి నెలకు రూ. 300 చొప్పున 1 లక్షా 44 వేల రూపాయల నిధి సమకూరుతుంది. మీరు 40 ఏళ్లపాటు ఇలా ఇన్వెస్ట్ చేయాలి. అది 15 శాతం తిరిగి ఇస్తే మీ ఫండ్ అక్షరాలా రూ. 94,21,127 ఉంటుంది. మీ పెట్టుబడి రూ.1 లక్ష 44 వేలు అయితే రాబడి రూ. 92,77,127. అప్పుడు మీ మొత్తం డబ్బు రూ. 94,21,127 అవుతుంది. SIPల నుండి వచ్చే రాబడులు పెట్టుబడి వ్యవధి, ఆశించిన ఫండ్, పెట్టుబడి మొత్తం, రాబడి శాతం అనే నాలుగు అంశాలపై ఆధారపడి ఉంటాయి. మొదటి మూడు అంశాలను అమలు చేయడం పెట్టుబడిదారుడి ఇష్టం. కానీ పర్సంటేజీ రాబడి ఎవరి చేతుల్లో ఉండదు. ఇది మార్కెట్ పరిస్థితులను బట్టి మారుతుంది.
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Deposit just rs 10 sip per day you will become a millionaire
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com