Maruti Dzire Discount:మారుతి కొత్త డిజైర్ కారును కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారా.. మీ బడ్జెట్ సరిపోకపోతే డిసెంబర్ నెలలో డిజైర్ పాత మోడల్‌ను భారీ తగ్గింపుతో కొనుగోలు చేయడానికి ప్లాన్ చేసుకోవచ్చు. దేశంలోని అతిపెద్ద కార్ కంపెనీ మారుతీ సుజుకి ఇండియా డిసెంబర్ 2024 చివరి నెలలో తన కార్లపై భారీ డిస్కౌంట్లను ప్రకటించింది. మారుతి సుజుకి డిజైర్ పాత మోడల్‌పై మాత్రమే కాకుండా, దాని అనేక విభిన్న మోడళ్లపై డిస్కౌంట్లను ప్రకటించింది. ఇందులో వ్యాగన్ ఆర్, ఈకో, బ్రెజ్జా, ఓల్డ్ జెన్ స్విఫ్ట్, సెలెరియో వంటి కార్లు కూడా ఉన్నాయి.
డిజైర్‌పై రూ. 30,000 ఆదా
డిసెంబర్‌లో డిజైర్‌ను కొనుగోలు చేయాలని ప్లాన్ చేసినట్లయితే.. ఈ కారు కొనుగోలుపై మీరు రూ. 30,000 వరకు ఆదా చేసుకోవచ్చు. కంపెనీ రూ. 15,000 వరకు నగదు తగ్గింపు, రూ. 15,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్‌ను అందిస్తోంది. ఇది డిఫరెంట్ వేరియంట్ల ప్రకారం మారవచ్చు. మారుతి డిజైర్ పాత మోడల్ ఎక్స్-షోరూమ్ ధర రూ.5.70 లక్షల నుండి ప్రారంభమవుతుంది. అయితే కంపెనీ కొత్త డిజైర్‌ను రూ. 6.79 లక్షల ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధరతో విడుదల చేసింది. కొత్త కారు సేఫ్టీలో 5-స్టార్ రేటింగ్‌ను పొందింది. అయితే కంపెనీ ఫస్ట్ టైం ఇందులో సన్‌రూఫ్‌ను కూడా అందిస్తోంది.
ఇతర మారుతీ వాహనాలపై తగ్గింపు
మారుతీ సుజుకి ఇండియా తన ఎరీనా షోరూమ్ నుండి విక్రయించే దాదాపు అన్ని మోడళ్లపై భారీ డిస్కౌంట్లను అందిస్తున్నట్లు తెలిపింది. ఇది నగరం నుండి నగరానికి, వివిధ డీలర్ల వారిగా మారవచ్చు అయినప్పటికీ, ఏ వాహనంపై ఎంత తగ్గింపు అందుబాటులో ఉందో పూర్తి జాబితా కింద ఉంది.
* Alto K10 – ఈ కారు డ్రీమ్ ఎడిషన్‌పై రూ. 43,302 వరకు నగదు తగ్గింపు ఉంది. ఇతర వేరియంట్లలో రూ. 15,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్, రూ. 2,100 వరకు అదనపు ప్రయోజనాలు అందుబాటులో ఉన్నాయి.
* సెలెరియో – ఈ కారు డ్రీమ్ ఎడిషన్‌పై రూ. 54,984 వరకు నగదు తగ్గింపును కూడా పొందవచ్చు. మిగిలిన వేరియంట్లపై కంపెనీ రూ. 15,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్, రూ. 2,100 వరకు ఇతర ప్రయోజనాలను అందిస్తోంది.
* S-Presso – డ్రీమ్ ఎడిషన్‌లో రూ. 49,853 నగదు తగ్గింపు ద్వారా ఆదా చేసుకోవచ్చు. మిగిలిన వేరియంట్లపై రూ. 15,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్, రూ. 2,100 వరకు ఇతర ప్రయోజనాలు అందుబాటులో ఉంటాయి.
* WagonR – కంపెనీ దాని వాల్ట్జ్ ఎడిషన్‌పై రూ. 49,900 నగదు తగ్గింపును అందిస్తుంది. ఇతర వేరియంట్లలో ఇది రూ. 15,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్, రూ. 2,100 వరకు అదనపు ప్రయోజనాలను అందిస్తోంది.
* స్విఫ్ట్ (ఓల్డ్ జెన్) – ఈ కారుపై రూ. 10,000 వరకు నగదు తగ్గింపు, రూ. 15,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ పొందవచ్చు.
* కొత్త స్విఫ్ట్ – ఈ కారు Biltz ఎడిషన్‌పై రూ. 50,000 వరకు నగదు తగ్గింపును పొందవచ్చు. ఇతర వేరియంట్లపై, రూ. 15,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్, రూ. 2,100 వరకు ఇతర ప్రయోజనాలు కూడా అందుబాటులో ఉంటాయి.
* బ్రెజ్జా – ఈ కారు అర్బానో ఎడిషన్‌పై రూ. 25,000 వరకు నగదు తగ్గింపును పొందవచ్చు. అయితే కంపెనీ రూ. 15,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్‌ను అందిస్తోంది.
* Eeco – దీనిపై రూ. 15,000 వరకు నగదు తగ్గింపు, రూ. 15,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ పొందవచ్చు.