
దేశంలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గిపోతోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 70,421 కేసులు నమోదయ్యాయి. ఏప్రిల్ 1 తర్వాత ఇంత తక్కువ సంఖ్యలో కేసులు నమోదవడం ఇదే తొలిసారి. అయితే మరణాల సంఖ్య మాత్రం కాస్త ఎక్కువగానే ఉంది. 24 గంటల్లో 3921 మంది కరోనా మరణించారు. ఇక 1,19,501 మంది కరోనా నుంచి కోలుకొని ఇళ్లకు వెళ్లారు. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 2,95,10,410కి చేరింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా యాక్టివ్ కేసులు 9,73,158 ఉన్నాయి.