
దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరిగాయి. నిన్నటితో పోలిస్తే ఇవాళ కొవిడ్ బారిన పడిన వారిసంఖ్య లో కాస్త పెరుగుదల నమోదైంది. గడిచిన 24 గంటల్లో 41,195 కరోనా కేసులు నమోదయ్యాయి. నిన్న ఈ సంఖ్య 38,353గా ఉంది. ప్రస్తుతం దేశంలో 3,87,987 కరోనా యాక్టివ్ కేసులున్నట్లు కేంద్ర వైద్యారోగ్యశాఖ తెలిపింది. కరోనా రికవరీ రేటు 97,45 శాతంగా ఉంది.