https://oktelugu.com/

కరోనా: పాఠశాలలను తెరవాలా? వద్దా? ఏంచేద్దాం?

కరోనా ప్రభావంతో ప్రపంచమే భారీ మూల్యం చెల్లించుకుంది. అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాలు సైతం వైరస్ దాడికి కుదేలైపోయాయి. దీంతో ఆర్థిక వ్యవస్థలు సైతం దెబ్బతిన్నాయి. ప్రజల ప్రాణాలు సైతం పోయాయి. ఈ నేపథ్యంలో కరోనా వైరస్ అంటేనే జంకుతున్నారు. వైరస్ ప్రభావంతో దేశాల మనుగడ మీదే పెను ప్రభావం చూపింది. చైనాలో ప్రారంభమైన వైరస్ మెల్లగా ప్రపంచం మొత్తం మీద తన ఆధిపత్యం ప్రదర్శించి అందరిలో భయాందోళనలు పెంచింది. కరోనా వల్ల విద్యావ్యవస్థ కూడా దెబ్బతింది. […]

Written By:
  • Srinivas
  • , Updated On : August 12, 2021 / 09:53 AM IST
    Follow us on

    కరోనా ప్రభావంతో ప్రపంచమే భారీ మూల్యం చెల్లించుకుంది. అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాలు సైతం వైరస్ దాడికి కుదేలైపోయాయి. దీంతో ఆర్థిక వ్యవస్థలు సైతం దెబ్బతిన్నాయి. ప్రజల ప్రాణాలు సైతం పోయాయి. ఈ నేపథ్యంలో కరోనా వైరస్ అంటేనే జంకుతున్నారు. వైరస్ ప్రభావంతో దేశాల మనుగడ మీదే పెను ప్రభావం చూపింది. చైనాలో ప్రారంభమైన వైరస్ మెల్లగా ప్రపంచం మొత్తం మీద తన ఆధిపత్యం ప్రదర్శించి అందరిలో భయాందోళనలు పెంచింది.

    కరోనా వల్ల విద్యావ్యవస్థ కూడా దెబ్బతింది. గతేడాది మార్చి నుంచి ఇప్పటి వరకు పాఠశాలలు మూసివేశారు. దీంతో విద్యార్థులపై పెను ప్రభావం చూపింది. దీంతో విద్యార్థుల చదువు మధ్యలోనే ఆగిపోయింది. విద్యార్థులు ఇంట్లోనే ఉండడంతో ఆన్ లైన్ తరగతులు నిర్వహిస్తున్నా విద్యార్థులకు అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో విద్యార్థుల సంక్షేమం దృష్ట్యా పాఠశాలలు తెరిస్తేనే ఫలితం ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు.

    దీంతో పాఠశాలల ప్రారంభానికి విద్యాశాఖ నిర్ణయం తీసుకుంటుందని సమాచారం. కొవిడ్ ప్రభావంతో పాఠశాలలు మూతపడగా విద్యార్థులు మాత్రం ఇళ్లకే పరిమితమయ్యారు. గత మార్చిలో కొవిడ్ విజృంభించడంతో ఇక చేసేది లేక పాఠశాలలు మూసివేశారు. కానీ రెండు నెలలుగా కొవిడ్ ప్రభావం తగ్గడంతో పాఠశాలలు మళ్లీ ప్రారంభించాలని ప్రభుత్వం సంకల్పించింది. మరోపక్క వైద్య శాఖ కూడా సూత్రప్రాయంగా అంగీకరించింది. దీంతో పాఠశాలల ప్రారంభానికి చర్యలు సుగమం అయినట్లు భావిస్తున్నారు.

    అయితే విద్యాశాఖకు వైద్య శాఖ లిఖితపూర్వకంగా కాకుండా మౌఖికంగానే చెప్పినట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనిపై ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించి పాఠశాలల ప్రారంభంపై కీలక నిర్ణయం తీసుకోవచ్చని తెలుస్తోంది. ఇదే జరిగితే ఇన్నాళ్లు ఇంటికే పరిమితమైన విద్యార్థులు తమ చదువులు కొనసాగేందుకు ఈ మేరకు నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ నిర్ణయం ఏ విధంగా ఉంటుందోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

    రెండు నెలలుగా కొవిడ్ కేసులు గణనీయంగా తగ్గాయి. రోజుకు 500-700 మధ్య కొత్త కేసులు నమోదవుతున్నాయి. వరంగల్, కరీంనగర్, పెద్దపల్లి, ఖమ్మం, నల్గొండ తదితర జిల్లాల్లోని కొన్ని గ్రామాల్లో మినహా రాష్ర్టంలో కేసులు తగ్గుముఖం పట్టినట్లు తెలుస్తోంది. కరోనా వ్యాప్తి రేటు పలు స్టేట్లలో 1:1 ఉంటుండగా మన రాష్ర్టంలో మాత్రం ఒకటి కంటే తక్కువగా ఉంది. ఇది ప్రమాకరమైనదేమీ కాదని తెలుస్తోంది.

    పాఠశాల, కళాశాల విద్యార్థులకు ఆన్ లైన్ తరగతుల ప్రభావంతో విద్యార్థుల్లో మానసిక సమస్యలు తలెత్తుతున్నాయి. దీంతో వారి మానసిక స్థితి గతి తప్పుతోంది. ఫలితంగా తల్లిదండ్రులకు కూడా తలనొప్పిగా మారుతోంది. ఈ నేపథ్యంలో విద్యార్థులకు ప్రత్యక్ష తరగతులకే ప్రాధాన్యం ఏర్పడింది. దీంతో విద్యార్థుల మానసిక పరిపక్వత దెబ్బతినకుండా ఉండాలంటే పాఠశాలల ప్రారంభమే పరిష్కారమని తెలుస్తోంది.

    ఇప్పటికే విద్యార్థుల తల్లిదండ్రులకు వ్యాక్సినేషన్ ప్రక్రియ దాదాపు పూర్తయిన సందర్భంలో పాఠశాలల ప్రారంభానికి ఏ ఇబ్బందులు ఉండవని చెబుతున్నారు. పాఠశాలల శానిటేషన్ కూడా పూర్తి చేసేందుకు విద్యాశాఖ కసరత్తులు చేస్తోంది. విద్యార్థులకు కూడా ఇబ్బందులు ఉండకుండా చూసేందుకు ప్రణాళికలు రచిస్తోంది. దీంతో విద్యార్థులకు పాఠశాలలో ఏ సమస్యలు రాకుండా చూసుకుంటున్నారు.

    విద్యార్థుల్లో భౌతిక దూరం పాటించేందుకు నిర్ణయించారు. తరగతి గదుల్లో వెలుతురు ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటోంది. విద్యార్థులకు ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు నిర్వహించి ఆరోగ్యంపై అప్రమత్తంగా ఉండేందుకు చర్యలు చేపడుతున్నారు. ఉపాధ్యాయులు, పిల్లలు కూడా మాస్కులు ధరించేలా చూస్తున్నారు మధ్యాహ్న భోజన సమయంలో విద్యార్థులు ఒకే చోట కూర్చోకుండా జాగ్రత్తలు తీసుకునేందుకు సూచనలు చేసినట్లు తెలుస్తోంది.

    విద్యాశాఖ నిర్ణయంతో విద్యార్థులు కూడా సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. వైద్యశాఖ సూచించిన సలహాతో పాఠశాలల ప్రారంభంపై ఇప్పటికే నిర్ణయం తీసుకోవడంతో ఇక వెనక్కి తీసుకునేది లేదని చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా పాఠశాలల ప్రారంభానికి ఈనెల 16న ముహూర్తం ఖరారు చేసిన సంగతి తెలిసిందే. దీంతో మన రాష్ర్టంలో కూడా పాఠశాలల పున: ప్రారంభం ఖాయమనే చెప్పుకోవచ్చు. ప్రభుత్వం కూడా ఓకే చెప్పడంతో ఇక తరగతులు మొదలవుతాయని భావిస్తున్నారు.