కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ ఎన్నిక మరోసారి వాయిదా పడింది. అధ్యక్ష ఎన్నిక వాయిదా పపడం ఇది మూడోసారి. కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ ఎన్నికను జాన్ 23న నిర్వహించాలని ఆ పార్టీ వర్కింగ్ కమిటీ నిర్ణయించింది. సీడబ్ల్యూసీ ప్రకటన కొద్ది సేపటికే మళ్లీ ఎన్నికను వాయిదా వేస్తున్నట్లు పార్టీ తెలిపింది. కరోనా తీవ్రత వల్ల ప్రస్తుతానికి ఎన్నిక వాయిదా వేయాలని మెజార్టీ నాయకులు కోరడంతోనే అధ్యక్ష ఎన్నిక వాయిదా పడినట్లు సమాచారం.