తెలంగాణలో వైద్య ఆరోగ్యశాఖ ఈటల రాజేందర్ నుంచి సీఎం కేసీఆర్ చేతిలోకి వచ్చింది. అనూహ్య పరిణామాల మధ్య ఈటల ను వైద్య శాఖ నుంచి బర్తరఫ్ చేసిన తరువాత ఆ శాఖ ను కేసీఆర్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇతరులకు ఈ శాఖను కట్టబెట్టి వారిని అప్రమత్తం చేసే పరిస్థితి లేదు. కరోనా ఉధృతి పూర్తిగా తగ్గిన తరువాత మార్పులు చేయొచ్చు. అయితే కేసీఆర్ వైద్యఆరోగ్యశాఖ తన చేతిలోకి వచ్చిన తరువాత ఇటీవల సుధీర్ఘంగా సమీక్ష చేశారు. అంతేకాకుండా కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
రాష్ట్రంలో ప్రస్తుతం కరోనా కేసులతో పాటు మరణాల సంఖ్య తగ్గడం లేదు. దీంతో బాధితులకు చికిత్స అందించడానికి వెంటనే వైద్య సిబ్బందిని నియమించుకోవాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఇందుకోసం 50 వేల మంది ఎంబీబీఎస్ చదివిన వాళ్లను రిక్రూట్ చేయాలని నిర్ణయించారు. వారితో రోగులకు సేవలందించాలని, అవసరమైతే వారి పరీక్షల్లో వెయిటేజ్ మార్కులు కలపాలని నిర్ణయించారు.
ఇంతవరకు బాగానే ఉన్నా ఈ నిర్ణయం అమలు ఎంతవరకు సాధ్యమన్నది చాలా మంది విశ్లేషకులు అడుగున్న ప్రశ్న. హూటాహుటిగా 50 వేల మంది ఎంబీబీఎస్ చదివిన వాళ్లు కరోనా రోగులకు చికిత్స అందించడానికి ముందుకు వస్తారా..? అన్నది తేలాల్సిన అంశం. అయితే ఎంబీబీఎస్ చదివిన వాళ్లు 50 వేల మంది లేరు కాపోవచ్చుకానీ మెడికల్ పీల్డుకు సంబంధించిన ప్రతీ ఒక్కరినీ ఈ సేవలో భాగస్వాములు చేయాలన్నది సీఎం ఆలోచన కావచ్చు.
అయితే ఆ ప్రకారంగా చూసినా ప్రస్తుతం నర్సుల నుంచి వైద్యుల వరకు ఫుల్ డిమాండ్ ఉంది. ఇప్పటికే వైద్య రంగానికి చెందినవారికి లక్షల్లో జీతం ఇస్తూ కొన్ని హాస్పిటల్స్ లో చేర్చుకున్నాయి. ఈ పోజిషన్లో రెండు నెలల కాలానికి ఉన్న ఉద్యోగాన్ని విడిచి వైద్య సేవల కోసం ముందుకు వస్తారా..? అన్నది అనుమానమే నంటున్నారు. ఇదీ కాగా వరంగల్, ఆదిలాబాద్ జిల్లాల్లోని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను వెంటనే ప్రారంభించాలని ఆదేశాలు జారీ చేశారు. అందుకు సంబంధించిన నిధులను విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు.
కేసీఆర్ ఇలాంటి నిర్ణయాలు ఎన్నో తీసుకున్నా అవి అమలు వరకు వేరే విషయం ఉంటుందని సామాన్య పీపుల్ కూడ గెస్ చేసే రోజులివి. అయితే టీఆర్ఎస్ పార్టీ నాయకులు మాత్రం సీఎం తక్షణ నిర్ణయాలు తీసుకొని ప్రజలకు అందుబాటులో వైద్య సేవలందించేందుకు కృషి చేస్తున్నారని వారు సంబరాలు చేసుకుంటున్నారు.