Kingdom : విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) హీరో గా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘కింగ్డమ్'(Kindom Movie) పై ప్రేక్షకుల్లో అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదలైన గ్లింప్స్ వీడియోకి, అదే విధంగా మొదటి లిరికల్ వీడియో సాంగ్ కి ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా పాటలో విజయ్ దేవరకొండ కి సంబంధించిన షాట్స్ కొన్ని చూస్తే, ఆడియన్స్ కి అర్జున్ రెడ్డి గుర్తొచ్చాడు. ఈ చిత్రాన్ని మే30 న విడుదల చేయబోతున్నట్టు మేకర్స్ ఇది వరకే అనేక సందర్భాలలో పదే పదే చెప్పారు. కానీ ఈ సినిమా ఆ తేదీన రావడం లేదని అందరికీ కొద్దిరోజుల క్రితమే ఒక క్లారిటీ వచ్చింది. కానీ అభిమానులకు మాత్రం ఎదో ఒక మూల ఈ సినిమా కచ్చితంగా మే 30న విడుదల అవుతుందేమో అనే చిన్న ఆశ ఉండేది.
Also Read : విజయ్ దేవరకొండ ‘కింగ్ డమ్’ సినిమా పరిస్థితి ఏంటి..?రిలీజ్ డేట్ మార్చారా..?
కానీ ఇప్పుడు ఆ తేదీన రావడం లేదని స్పష్టమైంది. కాసేపటి క్రితమే మూవీ టీం ఈ చిత్రాన్ని జులై నాల్గవ తేదీన విడుదల చేయబోతున్నట్టు అధికారిక ప్రకటన చేశారు. విజయ్ దేవరకొండ ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘అభిమానులకు, ప్రేక్షకులకు ఈ సందర్భంగా మేము ఒక విషయాన్ని చెప్పాలని అనుకుంటున్నాము. కింగ్డమ్ చిత్రాన్ని మామూలుగా మే 30న విడుదల చేయాలని అనుకున్న సంగతి అందరికీ తెలిసిందే. కానీ ఇప్పుడు జులై 4న విడుదల చేయాలని నిర్ణయించుకున్నాము. వాస్తవానికి మే ౩౦న ఈ చిత్రాన్ని మీ ముందుకు తీసుకొచ్చేందుకు శతవిధాలుగా ప్రయత్నం చేశాము. కానీ రీసెంట్ గా మన దేశంలో జరిగిన కొన్ని దురదృష్టకరమైన సంఘటనల కారణంగా ఈ చిత్రాన్ని వాయిదా వేయాలనే నిర్ణయించుకున్నాము. ఇది మా కింగ్డమ్ చిత్రాన్ని మరింత మెరుగు పర్చడానికి కూడా ఉపయోగపడుతుంది’ అంటూ చెప్పుకొచ్చాడు. వాస్తవానికి జులై 4న నితిన్ ‘తమ్ముడు’ చిత్రాన్ని విడుదల చేయాల్సి ఉంది.
రీసెంట్ గానే అధికారిక ప్రకటన కూడా చేశారు. కానీ కింగ్డమ్ మూవీ టీం నితిన్, దిల్ రాజు లతో చర్చలు జరిపి ఆ సినిమాని వాయిదా పడేలా చేసి, దాని స్థానం లో ‘కింగ్డమ్’ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ వాళ్లకు కూడా కృతఙ్ఞతలు తెలియజేసారు. ఆయన మాట్లాడుతూ ‘మా సినిమా పరిస్థితులను అర్థం చేసుకొని దిల్ రాజు గారు, నితిన్ గారు ‘తమ్ముడు’ సినిమా డేట్ ని మాకు త్యాగం చేసినందుకు ఎంతో రుణపడి ఉన్నాము. ఈ సందర్భంగా వాళ్ళిద్దరికీ కృతఙ్ఞతలు తెలిజేస్తున్నాము’ అంటూ చెప్పుకొచ్చాడు విజయ్ దేవరకొండ. సినిమా వాయిదా పడడంపై కొంతమంది విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ అసంతృప్తి వ్యక్తం చేసినప్పటికీ, ఎక్కువ శాతం మంది మాత్రం మద్దతు తెలిపారు. అయితే కొంతమంది మాత్రం ఈ సినిమా వాయిదా పై అసలు కారణం చెప్తున్నారు. అనిరుద్ ఇంకా చాలా వరకు మ్యూజిక్ ట్రాక్స్ ఇవ్వాల్సి ఉందని, అందుకే విడుదల వాయిదా వేశారని అంటున్నారు.
Also Read : 50 సెకండ్స్ లో భీభత్సం..సంచలనం రేపుతున్న ‘కింగ్డమ్’ మొదటి సాంగ్ ప్రోమో!