CM Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఇందిరా భవన్ లో ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ తో భేటీ అయిన ఆయన స్థానిక ఎన్నికలు, అసంతృప్తులు, కార్పొరేషన్ ఛైర్మన్ల నియామకం, కొత్త మంత్రులకు శాఖల కేటాయింపుపై చర్చిస్తున్నారు.అనంతరం ఖర్గేతో భేటీ కానున్న రేవంత్ మరో ముగ్గురిని క్యాబినెట్ లోకి తీసుకోవడం, చీఫ్ విప్,ఎస్సీ వర్గీకరణ, బీసీ కులగణన అంశాలపై మాట్లాడనున్నారు.