Akhanda 2 Teaser : నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) హీరో గా నటించిన ‘అఖండ 2′(Akhanda 2 Movie) మూవీ టీజర్ కాసేపటి క్రితమే విడుదలైంది. రేపు బాలయ్య బాబు పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ ఈరోజు విడుదల చేశారు. ఈ టీజర్ కి సోషల్ మీడియా మొత్తం షేక్ అయ్యింది. ఇది కదా బాలయ్య నుండి మేము కోరుకునేది అంటూ నందమూరి అభిమానులు సంతోషంతో గెంతులేశారు. ముఖ్యంగా అభిమానులను త్రిసూలం షాట్ అమితంగా ఆకట్టుకుంది. ఇదే షాట్ పై ట్రోల్స్ కూడా పెద్ద ఎత్తున పడ్డాయి అనుకోండి, అది వేరే విషయం. బోయపాటి శ్రీను(Boyapati Srinu) సినిమాలో ఇలాంటివి ఉంటాయి అని ముందుగా ఫిక్స్ అయ్యి వెళ్తారు ఆడియన్స్. దానికి తోడు బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్ సినిమా అంటే ఇలాంటివి సర్వసాధారణం అనేది జనాల అభిప్రాయం. ఇదే టీజర్ వేరే హీరోకి పడుంటే ఈ పాటికి ట్రోల్స్ మామూలు రేంజ్ లో ఉండేవి కాదు.
కేవలం బాలయ్య కి మాత్రం సూట్ అయ్యే షాట్స్ అంటారు వీటిని. ఇదంతా పక్కన పెడితే ఈశ్వరుడు ఆజ్ఞ లేనిదే యముడు కూడా ప్రాణాలు తీయడు, అలాంటిది నువ్వు అమాయకుల ప్రాణాలు తీయాలని అనుకుంటావా అంటూ బాలయ్య డైలాగ్ చెప్పడం, ఆ వెంటనే విలన్ కళ్ళు చూపించడం హైలైట్ గా మారింది. అయితే ఆ కళ్ళు ఎవరివి అనేది ఇప్పుడు సోషల్ మీడియా లో పెద్ద చర్చ నడుస్తుంది. ఈ చిత్రం లో విలన్ గా ఆది పినిశెట్టి(Aadi Pinishetty) నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇవి ఆయన కళ్ళే అని అంటున్నారు. ఆయన కళ్ళని బట్టీ చూస్తుంటే ఇందులో అఘోర క్యారక్టర్ చేసినట్టుగా అనిపిస్తుంది. ఒక ఇద్దరి అఘోరాలు మధ్య జరిగే యుద్ధం గా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దినట్టు గా అనిపిస్తుంది. బాలయ్య బాబు మంచి వైపు ఉండే అఘోర అయితే, ఆది పినిశెట్టి దుష్ట శక్తుల వైపు ఉండే అఘోర అని ఈ టీజర్ ని చూస్తే తెలుస్తుంది.
అయితే తన అనుచరులతో బాలయ్య మీద దాడి చేయించాలి కానీ, ఈ టీజర్ లో ఏంటి బాలయ్య మీద ఆర్మీ సైనికులు దూసుకొచ్చినట్టు చూపించారు?, అసలు బోయపాటి శ్రీను మదిలో ఏముంది? అంటూ విశ్లేషకులు ఇప్పటి నుండే ఆరాలు తీస్తున్నారు. అయితే పాకిస్తాన్ సైన్యం తో విలన్ అఘోర చేతులు కలిపి, అమాయకుల ప్రాణాలు తీస్తుంటే బాలయ్య అడ్డుకొని వాళ్ళను హతమార్చేలాగా ఏదైనా సన్నివేశాన్ని బోయపాటి శ్రీను ప్లాన్ చేసి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కిస్తున్నారు కాబట్టి నార్త్ ఆడియన్స్ ని ఆకర్షించేందుకు పెహల్గామ్ ఉగ్ర దాడి ఘటన ని బేస్ చేసుకొని ఈ సన్నివేశాన్ని అల్లినట్టుగా అనిపిస్తుంది. చూడాలి మరి ఎలా ఉండబోతుంది అనేది. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమాలో హీరోయిన్ గా సంయుక్త మీనన్ నటిస్తుంది. చిత్రీకరణ చివరి దశలో ఉన్న ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 25 న విడుదల చేస్తారని అంటున్నారు. కానీ ఈ డేట్ లో రావడం అసాధ్యమని అంటున్నారు మరికొందరు.