
సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్ష ఫలితాలు నేడు వెల్లడికానున్నాయి. ఈరోజు మధ్యాహ్నం ఫలితాలను విడుదల చేయనున్నట్లు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ప్రకటించింది. జూలై 31 నాటికి సీబీఎస్ఈ ఫలితాలను ప్రకటించానలి భావిస్తున్నట్లు గత నెల కేంద్రం సుప్రీంకు వెల్లడించిన సంగతి తెలిసిందే. కరోనా ఉధృతి కారణంగా 12వ తరగతి పరీక్షలు రద్దయ్యాయి.