https://oktelugu.com/

కర్ఫ్యూపై ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం

  కరోనా పూర్తిగా తగ్గిపోయినా కూడా ఏపీ ప్రభుత్వం మాత్రం అప్రమత్తత చాటుకుంది. ఆగస్టులో థర్డ్ వేవ్ వస్తుందన్న అంచనాల నేపథ్యంలో జాగ్రత్తల విషయంలో వెనక్కి తగ్గకూడదని డిసైడ్ అయ్యింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా కరోనా వైరస్ నియత్రణ చర్యల్లో భాగంగా కీలక నిర్ణయం తీసుకుంది. మరో రెండు వారాల పాటు నైట్ కర్ఫ్యూను పొడిగించింది. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని తెలిపింది. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం […]

Written By:
  • NARESH
  • , Updated On : July 30, 2021 / 11:44 AM IST
    Follow us on

     

    కరోనా పూర్తిగా తగ్గిపోయినా కూడా ఏపీ ప్రభుత్వం మాత్రం అప్రమత్తత చాటుకుంది. ఆగస్టులో థర్డ్ వేవ్ వస్తుందన్న అంచనాల నేపథ్యంలో జాగ్రత్తల విషయంలో వెనక్కి తగ్గకూడదని డిసైడ్ అయ్యింది.

    ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా కరోనా వైరస్ నియత్రణ చర్యల్లో భాగంగా కీలక నిర్ణయం తీసుకుంది. మరో రెండు వారాల పాటు నైట్ కర్ఫ్యూను పొడిగించింది. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని తెలిపింది.

    ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం లాక్ డౌన్ ను పూర్తిగా ఎత్తివేసింది. కానీ ఏపీ ప్రభుత్వం మాత్రం ఇప్పటికీ కూడా రాత్రిపూట కొనసాగిస్తుండడం విశేషం. కోవిడ్ ప్రోటోకాల్స్ తప్పనిసరిగా పాటించాలని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ ఉత్తర్వులు జారీ చేశారు.

    కోవిడ్ నివారణ, వ్యాక్సినేషన్ పై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. థర్డ్ వేవ్ వస్తే ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని సీఎం జగన్ సూచించారు. ముఖ్యంగా థర్డ్ వేవ్ పిల్లలపై తీవ్ర ప్రభావం చూపుతుందనుకుంటున్న వేళ విజయవాడ, విశాఖపట్నం, తిరుపతిలో నిర్మించాలనుకుంటున్న పీడియాట్రిక్ సూపర్ కేర్ ఆస్పత్రుల పనులను వేగవంతం చేస్తున్నారు.

    థర్డ్ వేవ్ మొదలైందన్న సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే కేరళలో మొదలైంది. ఈ క్రమంలోనే ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యంగా వ్యవహరించొద్దని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. పోలీస్ బెటాలియన్స్ లో కూడా కోవిడ్ కేర్ ఎక్విప్ మెంట్ ఏర్పాటుతో పాటు వైద్యులను నియమించింది. కమ్యూనిటీ ఆస్పత్రులు స్థాయి వరకు ఆక్సిజన్ బెడ్లు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటోంది.

    పీహెచ్.సీల్లో కూడా ఆక్సిజన్ సిలిండర్లు, కాన్సంట్రేటర్లు అందుబాటులో ఉంచుతున్నారు. సబ్ సెంటర్ల వరకు టెలీమెడిసిన్ సేవలు, ఇంటర్ నెట్ సౌకర్యం అందుబాటులో ఉండేలా చూస్తున్నారు. ఏపీలోనే అత్యధిక కేసులు తూర్పు గోదావరి జిల్లాలో నమోదవుతున్నాయి. వైరస్ వ్యాప్తి ఇంకా కంట్రోల్ లోకి రావడం లేదు. దీంతో అక్కడ కర్ఫ్యూను తీవ్రం చేస్తున్నారు. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకే షాపులకు అనుమతిస్తున్నారు. ఆ తర్వాత ప్రజలు రోడ్లపైకి రావద్దని స్పష్టం చేస్తున్నారు.