
గత కొన్ని రోజులుగా తగ్గుతూ వస్తున్న పసిడి ధరలు శుక్రవారం మాత్రం ధర పైకి పరుగులు పెట్టింది. అదే దారిలో వెండి కూడా భారీగా పెరిగి కొనుగోలు దారులకు షాక్ ఇచ్చింది. శుక్రవారం హైదరాబాద్ మార్కెట్ లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 110 పెరగడంతో బంగారం ధర రూ. 48,990కు చేరింది. అదేవిధంగా 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా అదే దారిలో పయనించి రూ. 100 పెరుగుదలతో రూ. 44,900 కు చేరింది. వెండి రేటు రూ. 800 పెరగడంతో కేజి వెండి ధర రూ. 72,200 పెరిగింది.