Census: రెండు దశల్లో కుల, జనగణన పూర్తిచేయాలని హోం మంత్రి అమిత్ షా అధికారులను ఆదేశించించారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం జనగణనపై గెజిట్ విడుదల చేసింది. దేశంలో రెండు విడతల్లో జనగణన జరగనుంది. జమ్ముకశ్మీర్, ఉత్తరాఖండ్, హిమాచల్, లడఖ్ లో 2026 అక్టోబర్ నాటికి కుల జనగణన ముగియనుంది. మిగతా రాష్రాల్లో 2027 మార్చినాటికి పూర్తికానుంది. 15 ఏళ్ల తర్వాత దేశంలో జన గణన జరగనుంది. దీనికి సంబంధించి కేంద్ర హోంశాక నోటీఫికేషన్ జారీ చేసింది.