Malla Reddy Latest Viral Video: దాదాపు ఏడుపదుల వయసుకు దగ్గరగా వచ్చినప్పటికీ.. కార్మిక శాఖ మాజీమంత్రి మల్లారెడ్డి సార్ లో ఉత్సాహం ఏమాత్రం తగ్గడం లేదు. పైగా ఆయన రోజురోజుకు కుర్రాడు అయిపోతున్నాడు. పాలు, పూలు అమ్మడం మాత్రమే కాదు.. సైకిల్ కూడా తొక్కుతాను.. అవసరమైతే వీధుల వెంట పరుగులు తీస్తాను అంటూ నిరూపిస్తున్నాడు కార్మిక శాఖ మాజీమంత్రి.. నిత్యం ఏదో ఒక విషయం ద్వారా సోషల్ మీడియాలో కనిపించే మల్లారెడ్డి సార్.. తాజాగా ఒక వీడియోలో దర్శనమిచ్చారు.. ఆ వీడియోలో ఆయన చేసిన పని మామూలుగా లేదు. పైగా ఈ వయసులోనూ పాతికేళ్ల కుర్రాడిలాగా ఉత్సాహాన్ని చూపిస్తూ ఆయన చేసిన పని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇంతకీ మల్లారెడ్డి సార్ ఏం చేశారంటే..
మల్లారెడ్డి సార్ ఏం చేసినా సంచలనమే.. పాలమ్మి, పూలమ్మి ఈ రేంజ్ కి వచ్చిన అని చెప్పే ఆయన.. చేసే పనులు కూడా అదే స్థాయిలో ఉంటాయి. ఇటీవల జపాన్ దేశంలో ఆయన సతీసమేతంగా పర్యటించారు. అక్కడ అందమైన దృశ్యాలను చూశారు. అక్కడి సంప్రదాయ బద్ధమైన దుస్తులను ధరించి అలరించారు. అంతేకాదు అక్కడి ట్రెడిషనల్ వంటకాలు కూడా రుచి చూసి ఆకట్టుకున్నారు. జపాన్ పర్యటన ముగిసిన తర్వాత సోషల్ మీడియాలో సందడి చేశారు. కొన్ని చానల్స్ కు ఇంటర్వ్యూలు కూడా ఇచ్చారు. ఇక తాజాగా ఎలక్ట్రిక్ సైకిల్ తొక్కుతూ ఆకట్టుకున్నారు. తన క్యాంపు కార్యాలయంలో ఎలక్ట్రిక్ సైకిల్ ను నడిపి అలరించారు. అంతేకాదు వీధుల వెంట పరుగులు తీసి తన ముచ్చట తీర్చుకున్నారు. ఈ వీడియోను ఓ వ్యక్తి తన సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. వైరల్ గా మారిపోయింది. చూస్తుండగానే ఊహించని స్థాయిలో వీక్షణలు సొంతం చేసుకుంది. ఇక కామెంట్స్ కైతే లెక్కేలేదు. ఒక్కొక్కరు ఒక్కో స్థాయిలో కామెంట్ చేస్తున్నారు. అయితే ఇందులో కొన్ని నెగటివ్ గా.. మరి కొన్ని పాజిటివ్ గా ఉన్నాయి. కామెంట్స్ ఎలా ఉన్నప్పటికీ.. నేటిజెన్లు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ ఉండడం విశేషం.
“మల్లారెడ్డి సార్ ఏం చేసినా సంచలనమే. ఆయన మాట్లాడితే సోషల్ మీడియా షేక్ అవుతుంది. ఆయన అడుగుపెడితే మీడియా దద్దరిల్లిపోతుంది. మాట మాట్లాడితే ప్రతిదీ ప్రకంపనం అవుతుంది. చివరికి ఎలక్ట్రిక్ సైకిల్ నడిపినా సరే అది అద్భుతానికి దారి తీస్తుంది. ఆయన సైకిల్ నడపడం.. అది కాస్త సోషల్ మీడియాలోకి ఎక్కడంతో ఒక్కసారిగా సంచలనగా మారిందని” నెటిజన్లు అంటున్నారు. “ఆయన ఆరోగ్య రహస్యం మామూలుగా లేదని.. ఏం తింటారో తెలియదు కాని.. విపరీతమైన ఉత్సాహంతో ఉన్నారని.. అచంచలమైన ఆత్మవిశ్వాసంతో కనిపిస్తున్నారని” మల్లారెడ్డి అభిమానులు సోషల్ మీడియాలో వ్యాఖ్యానిస్తున్నారు..
View this post on Instagram