ఆనందయ్య మందుతో వ్యాపారం.. అచ్చెన్నాయుడు
ఆనందయ్య ఔషదం పేరుతో వైకాపా దొంగ వ్యాపారం చేస్తోందని ఏపీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు. ఈ కుట్ర బయటపెట్టిన మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై చీటింగ్, ఫోర్జీరి, చోరీ కేసులా? అని నిలదీశారు. రాష్ట్ర ప్రభుత్వం యథేచ్ఛగా చట్టాలను ఉల్లంఘిస్తోందని అచ్చెన్న ఆరోపించారు. అవినీతిపరుల్నీ ప్రోత్సహించడమే ధ్యేయంగా వైకాపా పాలన కొనసాగుతోందని ఆక్షేపించారు. బెదిరించిన వాళ్లకు, బ్లాక్ మెయిల్ చేసిన వారిని వదిలేస్తారా అని ఆయన నిలదీశారు.
Written By:
, Updated On : June 6, 2021 / 01:58 PM IST