ఆనందయ్య మందును విమర్శించి.. అందులో వైసీపీ ఎమ్మెల్యేలను ఇన్ వాల్వ్ చేసి దోపిడీ ఆరోపణలు చేసిన టీడీపీ మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై వైసీపీ ప్రతీకార చర్యలు మొదలుపెట్టింది. అదును చూసి కేసులు నమోదు చేసింది. ఇప్పటికే చాలా మంది టీడీపీ మాజీ మంత్రులను టార్గెట్ చేసిన వైసీపీ ఇప్పుడు సోమిరెడ్డిని టార్గెట్ చేసింది.
నిన్న ప్రెస్ మీట్ లో ఆనందయ్య మందును వైసీపీ ఎమ్మెల్యే అమ్ముకుంటున్నారని.. ప్రభుత్వం క్యాష్ చేసుకుంటుందని సోమిరెడ్డి ఆరోపించారు. ఓ వెబ్ సైట్ ను రూపొందించి భారీ స్కెచ్ వేశారని సోమిరెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. అందులో ఆనందయ్య మందును ఒక్కో ప్యాకెట్ పై రూ.15గా ఉందని..కానీ బుక్ చేసుకునే సమయానికి అన్ని చార్జీలతో కలిపి రూ.167 అని చూపించారని ఆరోపించారు. ఆనందయ్య మందు పేరుతో వందల కోట్ల వ్యాపారానికి కాకాణి గోవార్ధన్ రెడ్డి కుట్ర చేశారని ఆరోపించారు.
ఈ నేపథ్యంలోనే తమ వెబ్ సైట్ పై సోమిరెడ్డి అసత్య ప్రచారం చేశారని శేశ్రిత టెక్నాలజీ ఎండీ నర్మదారెడ్డి కృష్ణపట్నం పోర్ట్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ కింద సోమిరెడ్డిపై చీటింగ్, ఫోర్జరీ, దొంగతనం కేసులు నమోదు చేసినట్టు కృష్ణపట్నం పోర్ట్ పోలీసులు తెలిపారు.
ఇక కాకాని గోవర్ధన్ రెడ్డి కూడా తనపై ఆరోపణలకు కేసులు పెట్టేందుకు రెడీ అవుతున్నట్టు తెలిసింది. పలు సెక్షన్ల కింద నిరూపించని ఆరోపణలపై ఆయన ఈ కేసులు పెట్టేందుకు రెడీ అయినట్లుగా తెలుస్తోంది. ఇక సోమిరెడ్డి దీన్ని హైకోర్టులోనే తేల్చుకునేందుకు రెడీ అవుతున్నారు.