ప్లాస్టిక్ బౌల్స్ లో భోజనం తినేవాళ్లకు షాకింగ్ న్యూస్..?

మనలో చాలామంది అందంగా కనిపించే ప్లాస్టిక్ బౌల్స్ లో ఆహారాన్ని తినడానికి చాలా ఇష్టపడతారు. అయితే శాస్త్రవేత్తలు, వైద్య నిపుణులు మాత్రం ప్లాస్టిక్ బౌల్స్ లో ఆహారం తినడం ఆరోగ్యానికి మంచిది కాదని చెబుతుండటం గమనార్హం. ప్లాస్టిక్ బౌల్స్ ఎక్కువగా మెలెమైన్ తో తయారవుతాయి. పులుసులు, వేడి వేడి కూరలు ప్లాస్టిక్ బౌల్స్ లో వేసిన వెంటనే ప్లాస్టిక్ లో ఉండే మెలమైన్ అ వేడికి ఆహారంలో కలిసే అవకాశం ఉంటుంది. మెలమైన్ శరీరంలో ఎక్కువ మొత్తంలో […]

Written By: Navya, Updated On : June 6, 2021 1:56 pm
Follow us on

మనలో చాలామంది అందంగా కనిపించే ప్లాస్టిక్ బౌల్స్ లో ఆహారాన్ని తినడానికి చాలా ఇష్టపడతారు. అయితే శాస్త్రవేత్తలు, వైద్య నిపుణులు మాత్రం ప్లాస్టిక్ బౌల్స్ లో ఆహారం తినడం ఆరోగ్యానికి మంచిది కాదని చెబుతుండటం గమనార్హం. ప్లాస్టిక్ బౌల్స్ ఎక్కువగా మెలెమైన్ తో తయారవుతాయి. పులుసులు, వేడి వేడి కూరలు ప్లాస్టిక్ బౌల్స్ లో వేసిన వెంటనే ప్లాస్టిక్ లో ఉండే మెలమైన్ అ వేడికి ఆహారంలో కలిసే అవకాశం ఉంటుంది.

మెలమైన్ శరీరంలో ఎక్కువ మొత్తంలో చేరితే కిడ్నీలో రాళ్ల సమస్య వచ్చే అవకాశం ఉందని వైద్య నిపుణులు చెబుతుండటం గమనార్హం. జామా ఇంటర్నల్‌ మెడిసిన్‌ కు సంబంధించిన అధ్యయనంలో ఈ అధ్యయనానికి సంబంధించిన ఫలితాలు ప్రచురితమయ్యాయి. ప్లాస్టిక్ లో ఉండే మెలమైన్ శరీరంలో చేరితే కిడ్నీలో రాళ్లు వచ్చే అవకాశంతో పాటు క్యాన్సర్ వచ్చే అవకాశాలు కూడా పెరుగుతాయని సమాచారం.

శాస్త్రవేత్తలు పింగాణీ బౌల్ లో కొంతమందికి, ప్లాస్టిక్ బౌల్ లో కొంతమందికి నూడుల్స్ ఇవ్వగా ప్లాస్టిక్ బౌల్స్ లో ఉన్న నూడుల్స్ తిన్నవారికి మెలమైన్‌ పాళ్లు దాదాపు ఎనిమిది రెట్లు ఎక్కువగా ఉన్నాయని తేలింది. మెలమైన్ బౌల్ లో ఉంచి ఆహారాన్ని వేడి చేయకూడదని ఎఫ్‌డీఏ చెబుతుండటం గమనార్హం. మహిళలు మెలమైన్ ను ఎక్కువగా తీసుకుంటే ప్లాస్టిక్‌ ప్రభావం మహిళల్లోని ఈస్ట్రోజెన్‌ హార్మోన్‌పై ఉంటుందని తెలుస్తోంది.

శరీరంలో మెలమైన్ చేరడం వల్ల పురుషుల్లో వీర్యకణాల సంఖ్య, కదలికలు తగ్గే అవకాశంతో పాటు మహిళల్లో గర్భధారణ సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.ఇలా ఆహారం తీసుకునే వారిలో మెదడు కణాలు బలహీన పడి జ్ఞాపకశక్తి తగ్గుతున్నట్లు, మూడ్స్‌ మారిపోవడం వంటి సమస్యలు వస్తున్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు.