
తెలంగాణ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మహేదేవపూర్ మండల కేంద్రంలోని బొమ్మాపూర్ మూల మలుపు వద్ద ద్విచక్రవాహనాన్ని ఓ ఇసుక లారీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో మండలంలోని ఎన్కపల్లి గ్రామానికి చెందిన రాజగౌడ్, శంకర్ గౌడ్ అనే ఇద్దరు అన్నదమ్ములు తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స కోసం తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందారు. కాగా, శంకర్ గౌడ్ కు కుమారుడు విష్ణు గౌడ్ పరిస్థితి విషమంగా ఉంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.