కాంగ్రెస్, టీఆర్ఎస్ పై కౌశిక్ రెడ్డి ప్రభావం ఎంత?

ఆటలో అరటిపండులా కౌశిక్ రెడ్డి మారిపోయారు. అటు కాంగ్రెస్ , ఇటు బీజేపీ మధ్యలో టీఆర్ఎస్ మూడు పార్టీల మధ్యలో ఎటూ కాకుండా పోయారు. కాంగ్రెస్ హుజూరాబాద్ నియోజకవర్గ ఇన్ చార్జిగా ఉండి టీఆర్ఎస్ తో లోపాయికారిగా ఒప్పందం చేసుకొని కౌశిక్ రెడ్డి బయటపడ్డారు. ఆయన మాట్లాడిన ఆడియో లీక్ లతో ఇక కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పాల్సి వచ్చింది. తప్పనిసరి పరిస్థితుల్లో టీఆర్ఎస్ బాట పడుతున్నారు.ఇప్పటికే టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ ను […]

Written By: NARESH, Updated On : July 14, 2021 2:14 pm
Follow us on

ఆటలో అరటిపండులా కౌశిక్ రెడ్డి మారిపోయారు. అటు కాంగ్రెస్ , ఇటు బీజేపీ మధ్యలో టీఆర్ఎస్ మూడు పార్టీల మధ్యలో ఎటూ కాకుండా పోయారు. కాంగ్రెస్ హుజూరాబాద్ నియోజకవర్గ ఇన్ చార్జిగా ఉండి టీఆర్ఎస్ తో లోపాయికారిగా ఒప్పందం చేసుకొని కౌశిక్ రెడ్డి బయటపడ్డారు. ఆయన మాట్లాడిన ఆడియో లీక్ లతో ఇక కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పాల్సి వచ్చింది. తప్పనిసరి పరిస్థితుల్లో టీఆర్ఎస్ బాట పడుతున్నారు.ఇప్పటికే టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ ను రహస్యంగా కలిసి హుజూరాబాద్ టీఆర్ఎస్ టికెట్ ను ఖరారు చేసుకున్నానని చెప్పుకున్నాడు.

అయితే తాజా పరిణామాల నేపథ్యంలో కౌశిక్ రెడ్డికి టీఆర్ఎస్ టికెట్ ఇస్తుందా? లేదా? అన్నదే పెద్ద డౌట్. ఈటలరాజేందర్ పై బీసీ నేత ఎల్.రమణను దించే అవకాశాలు లేకపోలేదు. ఎందుకంటే హుజూరాబాద్లో ఈటల బీసీ నినాదం లేవనెత్తారు. దానికి ధీటుగా కాంగ్రెస్ పార్టీ కూడా బీసీ లీడర్ అయిన పొన్నం ప్రభాకర్ ను తెరపైకి తీసుకొచ్చింది. కౌశిక్ రెడ్డి హ్యాండ్ ఇవ్వడంతో ఆగమేఘాలపై పొన్నంను దించి లాబీయింగ్ చేస్తోంది.

ఇక కౌశిక్ రెడ్డి బలం బలగం హుజూరాబాద్లో బాగానే ఉంది. గత 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ తరుపున పోటీ చేశారు. ఈటల రాజేందర్ కు గట్టి పోటీనిచ్చి స్వల్ప తేడాతో ఓడిపోయారు. ఈటలను ఓడిస్తాడని అందరూ అనుకున్నారు. కానీ తృటిలో చేజార్చుకున్నారు. అయితే అప్పటినుంచి కౌశిక్ రెడ్డి కాంగ్రెస్లోనే కొనసాగుతున్నారు.

అయితే కౌశిక్ రెడ్డి వరుస ఆడియోలు లీక్ కావడంతో ఆయనపై బ్యాడ్ నేమ్ నియోజకవర్గంలో పడింది. సానుభూతి కాస్తా రివర్స్ అయ్యింది. దీంతో టీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇస్తుందా? లేదా? అన్నది ఆసక్తిగా మారింది.

మరోవైపు టీఆర్ఎస్ అభ్యర్థి కోసం నాయకులు అన్వేషణ సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి ముద్దసాని దామోదర్ రెడ్డి కుమారుడు టీడీపీ లీడర్ కశ్యప్ రెడ్డి టీఆర్ఎస్ లోకి చేరారు. అయితే తనకు టికెట్ విషయంపై ఎలాంటి హామీ ఇవ్వలేదు. దీంతో కశ్యప్ రెడ్డికి టికెట్ ఇచ్చే అవకాశం లేదని తెలిసింది. ఇక కొన్ని రోజుల కిందట కమలాపూర్ గ్రామానికే చెందిన ఓ సీఐ పేరు వినిపించింది. విద్యావంతుడు, అధికారిని ఎన్నికల్లో ఉంచితే లాభిస్తుందని టీఆర్ఎస్ భావించింది. అయితే అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.

టీఆర్ఎస్ అభ్యర్థిగా కౌశిక్ రెడ్డి పేరు ప్రకటిస్తే మాత్రం పోయిన సారి రెండో స్థానంలో ఉన్న ఆయనకి ఈసారి ఎడ్జ్ ఉండొచ్చు. ఈటల చేతిలో వరుసగా ఓడిపోయిన సానుభూతి ఉంది. ఆసెంటిమెంట్ తోపాటు అధికార టీఆర్ఎస్ బలం, బలగం తోడైతే ఈటలకు గట్టి పోటీనివ్వగలడు. టీఆర్ఎస్ కు ఖచ్చితంగా మొదటి ఆప్షన్ కౌశిక్ రెడ్డినే. ఇతడు నిలబడితే బీజేపీకి గులాబీ పార్టీ గట్టి పోటీనివ్వగలదు. అయితే ఆయన దూకుడు ఇప్పుడు మైనస్ గా మారింది. ఇక కౌశిక్ రెడ్డికి ఇదివరకే కేటీఆర్ ను కలిశారు. ఆసమయంలో టికెట్ పై ఎలాంటి హామీ ఇవ్వలేదు.

తాజాగా టీఆర్ఎస్ నాయకులతో సమావేశం కావడంతో కౌశిక్ రెడ్డికి టికెట్ వచ్చే అవకాశాలున్నాయని అనుకుంటున్నారు. బలమైన నేత కావడం.. నియోజకవర్గంలో బలం ఉండడం కౌశిక్ రెడ్డికి ప్లస్ పాయింట్లు. అయితే ఇటీవల ఆడియో లీక్ లతో ఆయనపై మరకపడింది. మరి దాన్ని తుడిచివేసుకుంటాడా? లేదా అన్నది చూడాలి. ఇక టీఆర్ఎస్ అధిష్టానం కౌశిక్ రెడ్డి విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.. మాజీ మంత్రి ఎల్.రమణ పేరు కూడా హుజూరాబాద్ లో వినిపిస్తోంది. కౌశిక్ రెడ్డిపై వివాదాల నేపథ్యంలో రమణను తెరపైకి తెచ్చే అవకాశం ఉంది.