
కడప బ్రహ్మంగారి మఠానికి సంబంధించిన వ్యవహారం ఇంకా సద్దుమణగలేదు. ఎమ్మెల్యే రఘురామిరెడ్డి తనతో ఇంతవరకూ చర్చించలేదని వెంకటేశ్వర స్వామి రెండవ భార్య మారుతి మహాలక్ష్మమ్మ వెల్లడించారు. నేడు బ్రహ్మంగారి మఠంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ పెద్ద భార్య కుమారుడైన వెంకటాద్రి వీరభద్రయ్యలు మాత్రమే ఎమ్మెల్యేతో సమావేశమయ్యారని ఆమె తెలిపారు. సాయంత్రం తనతో చర్చిస్తామని ఎమ్మెల్యే తెలిపారన్నారు. కర్నాటక కరుణాకర్ రెడ్డి అభిప్రాయం మేకు తమ అంగీకారం తెలియజేస్తామన్నారు.