Astrology Today: 2024 మార్చి 27న ద్వాదశ రాశులపై చిత్ర నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈ సందర్భంగా సింహ రాశి వారి పూర్వీకుల ఆస్తి విషయంలో శుభవార్త వింటారు. కర్కాటక రాశివారు వాదనలకు దిగొద్దు. మిగతా రాశుల వారి ఫలితాలు ఏవిధంగా ఉన్నాయో చూద్దాం..
మేషరాశి:
ఈ రాశివారు ఈరోజు కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. శుభకార్యాల్లో పాల్గొంటారు. కొన్ని వర్గాల వారి సంపద పెరుగుతుంది. కుటుంబంలో ఎవరికైనా మంచి జరుగుతంది.
వృషభ రాశి:
వ్యాపారులు పెట్టుబడులు పెట్టడానికి అనుకూల సమయం. పెండింగులో ఉన్న సమస్యలు నేటితో పరిష్కారం అవుతాయి. కుటుంబంలో ఎలాంటి వివాదాలున్నా బయటకు చెప్పకపోవడమే మంచిది.
మిథునం:
కొత్ వ్యక్తులతో జాగ్రత్తగా ప్రవర్తించాలి. గతంలో ఉన్న వివాదాలు పరిష్కారం అవుతాయి. చట్టపరమైన సమస్యలు ఎదుర్కొంటారు. పెట్టుబడుల విషయంలో సీనియర్ల సలహాలు తీసుకోవాలి.
కర్కాటకం:
ఉద్యోగులు సీనియర్లతో వాదనలకు దిగకూడదు. కొత్త వ్యక్తులను కలుసుకుంటారు. భవిష్యత్ గురించి ఆలోచిస్తారు. కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి.
సింహ:
ఉద్యోగులు తమ భావాలను ఇతరులతో పంచుకుంటారు. ఓ శుభవార్త వింటారు. కుటుంబ సభ్యుల మద్దతు ఉంటుంది. పూర్వీకుల ఆస్తి విషయంలో శుభవార్త వింటారు.
కన్య:
ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఏ పని చేపట్టినా లాభాలు వస్తాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు ఉండాలి. జీవిత భాగస్వామితో ఏదైనా పనిని ప్రారంభిస్తే సక్సెస్ అవుతుంది.
తుల:
పరిచయం లేని వ్యక్తుల నుంచి దూరంగా ఉండాలి. ఆరోగ్యంపై నిర్లక్ష్యం చేయొద్దు. ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి. చిన్న పిల్లల నుంచి శుభవార్త వింటారు.
వృశ్చికం:
ఉద్యోగులు కార్యాలయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ప్రియమైన వారితో సమయం వెచ్చిస్తారు. నిరుద్యోగులు శుభవార్త వింటారు. పాత సమస్యల నుంచి బయటపడే మార్గం వెతుక్కోవాలి.
ధనస్సు:
ఉద్యోగులు కార్యాలయాల్లో అంకిత భావంతో పనిచేయాలి. ఆదాయం పెరుగుతున్నా.. ఖర్చులు అధికంగా ఉంటాయి. ప్రతీ పనిలో అవగాహన పెంచుకునే ప్రయత్నం చేయాలి.
మకర:
కుటుంబ సభ్యుల నుంచి సమస్యలు ఎదుర్కొంటారు. ప్రతిభ ఉన్న వారికి అవకాశాలు పెరుగుతాయి. ముఖ్యమైన విషయాల్లో నిర్లక్ష్యంగా ఉండకూడదు.
కుంభం:
కొత్త వ్యక్తులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారస్తులు వ్యక్తిగత అభివృద్ధిపై దృష్టి పెట్టాలి. తల్లిదండ్రుల నుంచి ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయి.
మీనం:
ఉద్యోగులకు అనుకూలమైన వాతావరణం. వివాహ ప్రతిపాదనలు వస్తాయి. ఏదైనా అవార్డు అందుకోవడం వల్ల సమాజంలో గౌరవం పెరుగుతుంది.