ఆంధ్రప్రదేశ్‌Andhra Pradesh weather : ఏపీకి ఉపద్రవం తప్పదా?!

Andhra Pradesh weather : ఏపీకి ఉపద్రవం తప్పదా?!

Andhra Pradesh weather : ఏపీలో విచిత్ర వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఒకవైపు వర్షాలు, మరోవైపు ఎండలు దంచి కొడుతున్నాయి. నైరుతి రుతుపవనాలు ప్రవేశించడంతో వాతావరణంలో మార్పులు కూడా సంతరించుకుంటున్నాయి. మధ్యాహ్నం వరకు ఎండ ఉండగా.. ఒక్కసారిగా ఆకాశం మేఘావృతం అయి వర్షాలు పడుతున్నాయి. ఈరోజు అల్లూరి సీతారామరాజు, పోలవరం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్య సాయి, కడప జిల్లాలకు వర్ష సూచన ఉంది. అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. మిగిలిన జిల్లాల్లో కూడా తేలికపాటి వర్షాలు పడే సూచన ఉంది.

* ఈ జిల్లాలకు హెచ్చరిక..
మరోవైపు తీవ్ర వడ గాలులు సైతం కొనసాగుతున్నాయి. ఈరోజు 56 మండలాల్లో తీవ్ర, 67 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉంది. ప్రధానంగా శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, కాకినాడ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ప్రకాశం జిల్లాలో 42 డిగ్రీల నుంచి 44 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయి. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, చిత్తూరు, కడప, కర్నూలు, నంద్యాల, అనంతపురం జిల్లాల్లో 40 డిగ్రీల నుంచి 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్య ఛాన్స్ కనిపిస్తోంది. అత్యవసరం అయితే తప్ప ప్రజలు బయటకు వెళ్ళొద్దని విపత్తుల నిర్వహణ సంస్థ సూచిస్తోంది.

* నైరుతి ఆగమనం..
ఏపీలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. రాయలసీమ లోని కొన్ని ప్రాంతాలకు తాకాయి. మరో రెండు రోజుల్లో రాష్ట్రమంతా విస్తరిస్తాయి. అయితే ఈసారి ఎల్ నినో ప్రభావంతో ఆశించిన స్థాయిలో వర్షాలు పడే అవకాశం లేదు. దీంతో రైతుల్లో ఒక రకమైన ఆందోళన ఉంది. ప్రధానంగా ఈసారి పోలవరం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ, మార్కాపురం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, కడప, శ్రీ సత్య సాయి, అన్నమయ్య జిల్లాల్లో సాధారణం కంటే తక్కువ వర్షం పడొచ్చు అన్న అంచనాలు ఉన్నాయి. ఎన్టీఆర్, ఏలూరు, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాలో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదు కావచ్చు. శ్రీకాకుళం,అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కృష్ణా జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

AP Rainfall Deficit: ఏపీలో డేంజర్ బెల్స్.. భారీగా వర్షం లోటు!

AP Rainfall Deficit: ఏపీలో తీవ్ర వర్షాభావం నెలకొంది. కనీస స్థాయిలో కూడా వర్షాలు పడడం లేదు. ఆకాశం మేఘావృతం అవుతుందే తప్ప వరుణుడు మాత్రం దోబూచులాడుతున్నాడు. దీంతో ఏపీలో లోటు...

AP Rain Alert: ఉరుములు, పిడుగులు.. ఆ జిల్లాలకు హై అలెర్ట్!

AP Rain Alert: ఏపీ వ్యాప్తంగా చల్లటి వాతావరణం కొనసాగుతోంది. అక్కడక్కడ వర్షాలు పడుతున్నాయి. కానీ పూర్తిస్థాయిలో మాత్రం కురవడం లేదు. ఇంకా వర్షపాతం లోటు కనిపిస్తోంది. ఇటువంటి సమయంలో ఏపీ విపత్తుల...

Most Popular

Delhi Protests: అటు కాక్రోచ్ లు.. ఇటు రైతులు.. మోడీకి ఏంటీ తలనొప్పులు

Delhi Protests: ఢిల్లీ నగరం ఆందోళనలతో అట్టుడికి పోతుంది. గతంలో కేంద్రం వ్యవసాయ చట్టాలను తీసుకువచ్చింది. అప్పుడు హర్యానా, పంజాబ్ రాష్ట్రాలకు సంబంధించిన కొంతమంది రైతులు అందులో పాల్గొన్నారు. ఇదే అదునుగా ఖలీస్థానీ...

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కోడి చెరువు కబ్జాపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన

Pawan Kalyan: కొద్దిరోజుల క్రితం కొంతమంది స్వయంప్రకటిత, తెలంగాణ వాదులు, సో కాల్డ్ జర్నలిస్టులు.. యూట్యూబర్లు.. రచ్చ రచ్చ చేశారు. కోడి చెరువును జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కబ్జా చేశారని విమర్శలు...

Jagan: కేంద్ర పెద్దల అపాయింట్మెంట్ కోరిన జగన్.. ఏంటి కథ?!

Jagan: మద్యం కుంభకోణం ఏపీలో ప్రకంపనలు సృష్టించింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో భారీ కుంభకోణం జరిగింది. అయితే దీనిపై ఏర్పాటైన సీట్ విచారణ తుది దశకు వచ్చింది. అంతిమ లబ్ధిదారుడు ఎవరు...

Bhogapuram Airport Opening: ఆ రైతులకు ఉచిత విమాన ప్రయాణం!

Bhogapuram Airport Opening: ఉత్తరాంధ్రలో కీలక ఘట్టానికి సమయం ఆసన్నం అవుతోంది. ఆగస్టు 1న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం కానుంది. ప్రధాని నరేంద్ర మోడీ ఈ ఎయిర్పోర్టును జాతికి అంకితం చేయనున్నారు....

Tammineni Seetharam: ‘తమ్మినేని ఫ్యామిలీ’ పై క్యూ కడుతున్న బాధితులు!

Tammineni Seetharam: శ్రీకాకుళం జిల్లాలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. మొన్నటి వరకు ఆయన శాసనసభ స్పీకర్గా వ్యవహరించారు. అయితే ఆయనతోపాటు కుటుంబ సభ్యులను నకిలీ...
Exit mobile version