Homeఆంధ్రప్రదేశ్‌Andhra Pradesh weather : ఏపీకి ఉపద్రవం తప్పదా?!

Andhra Pradesh weather : ఏపీకి ఉపద్రవం తప్పదా?!

Andhra Pradesh weather : ఏపీలో విచిత్ర వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఒకవైపు వర్షాలు, మరోవైపు ఎండలు దంచి కొడుతున్నాయి. నైరుతి రుతుపవనాలు ప్రవేశించడంతో వాతావరణంలో మార్పులు కూడా సంతరించుకుంటున్నాయి. మధ్యాహ్నం వరకు ఎండ ఉండగా.. ఒక్కసారిగా ఆకాశం మేఘావృతం అయి వర్షాలు పడుతున్నాయి. ఈరోజు అల్లూరి సీతారామరాజు, పోలవరం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్య సాయి, కడప జిల్లాలకు వర్ష సూచన ఉంది. అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. మిగిలిన జిల్లాల్లో కూడా తేలికపాటి వర్షాలు పడే సూచన ఉంది.

* ఈ జిల్లాలకు హెచ్చరిక..
మరోవైపు తీవ్ర వడ గాలులు సైతం కొనసాగుతున్నాయి. ఈరోజు 56 మండలాల్లో తీవ్ర, 67 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉంది. ప్రధానంగా శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, కాకినాడ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ప్రకాశం జిల్లాలో 42 డిగ్రీల నుంచి 44 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయి. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, చిత్తూరు, కడప, కర్నూలు, నంద్యాల, అనంతపురం జిల్లాల్లో 40 డిగ్రీల నుంచి 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్య ఛాన్స్ కనిపిస్తోంది. అత్యవసరం అయితే తప్ప ప్రజలు బయటకు వెళ్ళొద్దని విపత్తుల నిర్వహణ సంస్థ సూచిస్తోంది.

* నైరుతి ఆగమనం..
ఏపీలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. రాయలసీమ లోని కొన్ని ప్రాంతాలకు తాకాయి. మరో రెండు రోజుల్లో రాష్ట్రమంతా విస్తరిస్తాయి. అయితే ఈసారి ఎల్ నినో ప్రభావంతో ఆశించిన స్థాయిలో వర్షాలు పడే అవకాశం లేదు. దీంతో రైతుల్లో ఒక రకమైన ఆందోళన ఉంది. ప్రధానంగా ఈసారి పోలవరం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ, మార్కాపురం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, కడప, శ్రీ సత్య సాయి, అన్నమయ్య జిల్లాల్లో సాధారణం కంటే తక్కువ వర్షం పడొచ్చు అన్న అంచనాలు ఉన్నాయి. ఎన్టీఆర్, ఏలూరు, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాలో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదు కావచ్చు. శ్రీకాకుళం,అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కృష్ణా జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Most Popular

Team India : ఈ స్క్రాప్ బౌలింగ్ తో వరల్డ్ కప్ కాదు కదా.. గ్రూప్ స్టేజీ దాటడం...

Team India : ఐపీఎల్ అనేది కాసుల క్రీడ. కేవలం బ్యాటర్ల కోసం మాత్రమే మైదానాలను రూపొందిస్తారు. అవన్నీ కూడా ప్లాట్ గా ఉంటాయి. ఒకరకంగా చెప్పాలంటే సిమెంట్ రోడ్ లాంటి మైదానాలు...

Karakatta Kamal Haasan : ఆ కరకట్ట కమల్ హాసన్ ఏం చేస్తున్నారో తెలుసా..

Karakatta Kamal Haasan : 2014లో ఏపీ రాష్ట్రంలో టిడిపి అధికారంలోకి వచ్చింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. నాడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజా వేదికను నిర్మించారు. ఆ నిర్మాణం అక్రమం అంటూ...

OG 2 Animation Video: ‘ఓజీ 2’ నుండి యానిమేషన్ వీడియో.. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కి ఊహించని...

OG 2 Animation Video: ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో మంచి హైప్ ని క్రియేట్ చేసుకున్న సీక్వెల్స్ లో ఒకటి 'ఓజీ 2'. పవన్ కళ్యాణ్ , సుజిత్ కాంబినేషన్...

Revanth Reddy And Kcr: వాసాలమర్రి.. కెసిఆర్ వీక్నెస్ తో ఆడుకుంటున్న రేవంత్..

Revanth Reddy And Kcr: భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు.. కెసిఆర్ ఉన్నట్టుండి యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించారు. ఆ జిల్లా పరిధిలో ఉన్న వాసాల మర్రి గ్రామంలో ఒకరోజు మొత్తం...

Siddharth Emotional: స్టేజి పై వెక్కిళ్లు పెట్టి ఏడ్చేసిన హీరో సిద్దార్థ్..వీడియో వైరల్..అసలు ఏమైందంటే!

Siddharth Emotional: ఒకప్పుడు యూత్ ఆడియన్స్ లో హీరో సిద్దార్థ్ కి ఎలాంటి క్రేజ్ ఉండేదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆరోజుల్లో బాయ్స్, నువ్వొస్తానంటే నేనొద్దంటానా , బొమ్మరిల్లు , కొంచెం ఇష్టం...
Oktelugu Epaper
Exit mobile version