అకాశంలో మబ్బులు కమ్ముకున్నప్పడు, వాతావరణం చల్లగా ఉన్నప్పడు ఎలా ఆడాలో కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ చూపించారని ఇంగ్లాండ్ పేసర్ జేమ్స్ అండర్సన్ అన్నాడు. వారిద్దరూ తమను లెంగ్తులు మార్చుకొనేలా ఒత్తిడి చేశారని పేర్కొన్నాడు. లార్డ్స్ మైదానం మరోసారి తనలోని అత్యత్తమ ఆటతీరును వెలికితీసిందని వెల్లడించాడు. తొలి ఇన్నింగ్స్ లో ఐదు వికెట్లు తీసిన అతడు 1951 తర్వాత ఈ ఘనత సాధించిన పెద్ద వయస్కుడిగా నిలిచాడు.