Virat And Rohit: టీమిండియాలో గంగూలీ, రాహుల్ ద్రావిడ్, సచిన్ టెండూల్కర్ త్రయం తర్వాత ఆ స్థాయిలో మన దేశ క్రికెట్ మీద ప్రభావం చూపించిన జోడీగా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ పేరు తెచ్చుకున్నారు. వీరిద్దరూ అద్భుతమైన క్రికెట్ ఆడారు. టీమిండియా కు అద్భుతమైన విజయాలు అందించారు. టీమ్ ఇండియా క్రికెట్ గతిని మొత్తం మార్చేశారు. వేగవంతమైన ఆటతీరుతో సరికొత్త చరిత్రను సృష్టించారు.
టీమిండియాలో తమ ఆట ద్వారా చెరగని ముద్ర వేసిన వీరిద్దరూ.. 2027 కప్ లో వీరిద్దరూ జట్టులో ఉంటారా? లేరా? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. వన్డేలలో కొనసాగాలంటే దేశవాళీ మ్యాచ్ లు ఆడాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి చెబుతూనే ఉంది. అయితే రోహిత్, విరాట్ రంజీలలో అంతంతమాత్రంగానే ఆడుతూ తప్పుకుంటున్నారు. బీసీసీఐ ఆదేశాల ప్రకారం విరాట్ కోహ్లీ మైదానంలో కసరత్తు చేయడం లేదు. రోహిత్ మైదానంలో సాధన చేస్తున్నప్పటికీ.. అతడిని సారధిగా కొనసాగించడంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి ఆసక్తిని చూపించలేదు. దీంతో రోహిత్ సాధారణ ఆటగాడు గానే మిగిలిపోయాడు. విరాట్ కూడా అలానే ఉండిపోయాడు. అయితే వీరిద్దరి లక్ష్యం 2027 వన్డే వరల్డ్ కప్ టీమ్ ఇండియాకు అందించడం.. ఇప్పుడు వినిపిస్తున్న వార్తల ప్రకారం వీరిద్దరూ జట్టులో ఉంటారా? అనే అనుమానం కలుగుతోంది.
రోహిత్ ను కెప్టెన్ స్థానం నుంచి బీసీసీఐ తప్పించింది. అతడిని సాధారణ ఆటగాడి స్థానానికే మాత్రమే పరిమిత చేసింది. విరాట్ కూడా సాధారణ ఆటగాడిగా ఎప్పటినుంచో కొనసాగుతున్నాడు. ప్రస్తుతం రోహిత్ వయసు 37 సంవత్సరాలు. విరాట్ వయసు 36 సంవత్సరాలు. ఇద్దరు మరో రెండు సంవత్సరాల పాటు వన్డేలలో కొనసాగడం దాదాపు అనుమానమే. మహా అయితే ఆస్ట్రేలియా సిరీస్ తర్వాత వీరిద్దరూ రిటైర్మెంట్ ప్రకటిస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. విరాట్ శారీరక సామర్థ్యం విషయంలో పెద్దగా ఇబ్బందులు లేకపోయినప్పటికీ.. వయసు వల్ల వచ్చే మార్పులు ఆట తీరుపై ప్రభావం చూపిస్తాయని విశ్లేషకులు అంటున్నారు. రోహిత్ కూడా ప్రస్తుతం సన్నబడినప్పటికీ.. రెండేళ్ల వరకు అతడు జట్టులో ఉండేది అనుమానమే.
విరాట్, రోహిత్ కు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. వీరిద్దరి ఆట తీరు చూడడానికి చాలామంది అభిమానులు వస్తుంటారు. ఆట ద్వారానే వీరిద్దరూ అంతటి అభిమానాన్ని సొంతం చేసుకున్నారు. అయితే ఇప్పుడు వీరిద్దరూ ఒక రకమైన సంకటనైన పరిస్థితిని ఎదుర్కొంటున్న నేపథ్యంలో.. అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోహిత్ శర్మపై కొంతకాలం కెప్టెన్సీ బాధ్యతలు అలాగే ఉంచితే బాగుండేదని.. మేనేజ్మెంట్ తొందరపడిందని కొంతమంది అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు.