Homeఎంటర్టైన్మెంట్Lenin Movie : 'లెనిన్' మొదటి వారం వరల్డ్ వైడ్ వసూళ్లు..ఇంత గ్రాస్ వస్తుందని అసలు...

Lenin Movie : ‘లెనిన్’ మొదటి వారం వరల్డ్ వైడ్ వసూళ్లు..ఇంత గ్రాస్ వస్తుందని అసలు ఊహించలేదు..

Lenin Movie : అక్కినేని అఖిల్ హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘లెనిన్’ రీసెంట్ గానే భారీ అంచనాల నడుమ విడుదలై సూపర్ హిట్ స్టేటస్ ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. కేవలం 3 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకొని , అఖిల్ కెరీర్ లో మొట్టమొదటి బ్లాక్ బస్టర్ గా నిల్చిన ఈ చిత్రం ఇప్పుడు వారం రోజులు పూర్తి చేసుకుంది. ఇప్పుడు అందరి ద్రుష్టి మొత్తం ఈ సినిమా ఫుల్ […]

Lenin Movie : అక్కినేని అఖిల్ హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘లెనిన్’ రీసెంట్ గానే భారీ అంచనాల నడుమ విడుదలై సూపర్ హిట్ స్టేటస్ ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. కేవలం 3 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకొని , అఖిల్ కెరీర్ లో మొట్టమొదటి బ్లాక్ బస్టర్ గా నిల్చిన ఈ చిత్రం ఇప్పుడు వారం రోజులు పూర్తి చేసుకుంది. ఇప్పుడు అందరి ద్రుష్టి మొత్తం ఈ సినిమా ఫుల్ రన్ లో 100 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబడుతుందా లేదా అనే దానిపైనే ఉంది. అయితే మొదటి వారం వచ్చిన వసూళ్లను బట్టీ చూస్తే , ప్రస్తుతానికి ఆ రేంజ్ గ్రాస్ వసూళ్లు రావడం కష్టమే అనిపిస్తోంది. ట్రేడ్ పండితులు అందిస్తున్న లెక్కల ప్రకారం ఈ చిత్రానికి 7 వ రోజున తెలుగు రాష్ట్రాల నుండి 1 కోటి 14 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు మాత్రమే వచ్చింది. ఓవరాల్ గా ప్రాంతాల వారీగా ఈ చిత్రానికి మొదటి వారం ఎంత వసూళ్లు వచ్చాయో చూద్దాం.

నైజాం ప్రాంతం లో ఈ చిత్రం మొదటి వారం ది బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చింది అనే చెప్పాలి. కేవలం ఆ ఒక్క ప్రాంతం నుండే మొదటి వారం చిత్రానికి 10 కోట్ల 50 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు నమోదు అయ్యాయి. అదే విధంగా సీడెడ్ ప్రాంతం నుండి 2 కోట్ల 91 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఈ ప్రాంతం కూడా లాభాల్లోనే ఉంది కానీ ,అనుకున్నంత ట్రెండ్ మాత్రం కనబర్చడం లేదు. అదే విధంగా ఉత్తరాంధ్ర నుండి 3 కోట్ల 17 లక్షలు , ఈస్ట్ గోదావరి నుండి 2 కోట్ల 9 లక్షలు , వెస్ట్ గోదావరి నుండి 1 కోటి 33 లక్షలు , గుంటూరు నుండి 1 కోటి 94 లక్షలు , కృష్ణా నుండి 1 కోటి 45 లక్షలు , నెల్లూరు నుండి 94 లక్షలు వచ్చాయి. ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల నుండి ఈ చిత్రానికి 24 కోట్ల 33 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు , 40 కోట్ల 90 లక్షల గ్రాస్ వసూళ్లు వచ్చాయి.

అదే విధంగా కర్ణాటక + రెస్ట్ ఆఫ్ ఇండియా నుండి 2 కోట్ల 5 లక్షలు , ఓవర్సీస్ నుండి 3 కోట్ల 62 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రానికి 30 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు , 54 కోట్ల 45 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ విడుదలకు ముందు ఈ చిత్రానికి 22 కోట్ల రూపాయలకు జరిగింది. అంటే ఇప్పటి వరకు 8 కోట్ల రూపాయిల లాభాలు వచ్చాయి అన్నమాట. ఈ వీకెండ్ వచ్చే వసూళ్లను బట్టీ ఈ చిత్రం డబుల్ బ్లాక్ బస్టర్ హిట్ స్టేటస్ కి చేరుతుందా లేదా అనేది చూడాలి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper