
దేశంలో కరోనా రక్కసి కల్లోలం చేస్తోంది. గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో 3600 మందికి పైగా వైరస్ ప్రాణాలు విడిచారు. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 18 లక్షల మందికి పరీక్షలు చేయగా 3,92, 488 మందికి పాజిటివ్ గా తేలింది. అంతక్రితం 24 గంటల్లో 4 లక్షలకు పైగా కొత్త కేసులు నమోదవగా నిన్న కాస్త తగ్గయి. ఇక తాజా కేసులతో దేశంలో మొత్తం కరోనా పాజిటివ్ ల సంఖ్య 1.95 కోట్లకు చేరింది. ఇదే సమయంలో రికవరీలు కాస్త ఊరటనిస్తున్నాయి.