
వచ్చే నెలలో 10 కోట్ల కొవిషీల్డ్ వ్యాక్సిన్లను ఉత్పత్తి చేసి, సరఫరా చేస్తామని ఆదివారం కేంద్ర ప్రభుత్వానికి తెలిపింది సీరమ్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియా. వ్యాక్సిన్లకు డిమాండ్ పెరిగిపోతున్న నేపథ్యంలో తమ సిబ్బంది 24 గంటలూ ఉత్పత్తిని పెంచడానికి పని చేస్తున్నట్లు కేంద్ర హోంమంత్రికి రాసిన లేఖలో సీరం స్పష్టం చేసింది. జూన్ నెలలో 10 కోట్ల వ్యాక్సిన్లు తయారు చేస్తామని చెప్పాడానికి సంతోషిస్తున్నాం. మే నెలలో 6.5 కోట్లుగా ఉన్న ఉత్పత్తిని పది కోట్లకు పెంచబోతున్నామని ఆ లేఖలో సీరం ప్రభుత్వం, రెగ్యులేటరీ అఫైర్స్ డైరెక్టర్ ప్రకాశ్ కుమార్ సింగ్ తెలిపారు.